ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరంలో.. నిద్రిస్తున్న వ్యక్తిపై కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. సెప్టెంబరు 2న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల అనంతరం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనసేనాని జన్మదిన వేడుకల్లో భాగంగా.. గ్రామంలో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వేడుకల అనంతరం కటౌట్ పక్కన నిద్రిస్తున్న గోపి అనే జనసైనికుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో చితకబాదారు. నందిగామ 20వ వార్డు మెంబర్ అభ్యర్థి అనుచరులే దాడికి పాల్పడినట్లు జనసైనికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై జనసేన జిల్లా సెక్రెటరీ తోట మురళీకృష్ణ విచారం వ్యక్తం చేసి.. పవన్ కల్యాణ్‌కు విషయాన్ని చేరవేశారు. గోపికి జనసేన అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చినట్లు మురళీకృష్ణ తెలిపారు. తమకు ఎవరితో శత్రుత్వం లేదని ఉద్దేశపూర్వకంగానే దాడి చేసినట్లు బాధితుడి తల్లి వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఆదోనిలో..