AP New Districts: ప్రాంతాలుగా విభజించినపుడో.. విడిపోయినపుడో ఒక్కోసారి కొన్ని ప్రదేశాలు ఒకటి కంటే ఎక్కువ సరిహద్దులుగా మారిపోతాయి. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుతో అలాంటి పరిస్థితే చోటుచేసుకుంది.
AP New Districts: ఒకే వీధి.. ఓ వైపు తూర్పుగోదావరి.. మరోవైపు ఏలూరు - problems in AP New Districts
AP New Districts: ఆ రెండు గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి.. ఇప్పటివరకు వేర్వేరు నియోజకవర్గాల్లో ఉన్నా.. ఒకే జిల్లాలో ఉండేది. కానీ జిల్లాల పునర్విభజనతో ఆ రెండు గ్రామాలు.. వేర్వేరు జిల్లాలోకి మారిపోయాయి. కుడివైపున ఉన్న ప్రాంతం ఒక జిల్లాలోకి... ఎడమవైపున ఉన్న ప్రాంతం మరో జిల్లాలోకి మారింది.
AP New Districts
రెండు మండలాలు, రెండు నియోజకవర్గాలే కాదు, రెండు వేర్వేరు జిల్లాలకు సరిహద్దుగా మారింది ఈ వీధి. కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలంలోని తాడిపూడి, పోలవరం నియోజకవర్గంలోని గూటాల పంచాయతీ పరిధిలోని మహాలక్ష్మిదేవిపేట గ్రామాలు.. వేర్వేరు జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. ఒకే వీధిలో కుడివైపున ఉన్న తాడిపూడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి మారగా, ఎడమ వైపున ఉన్న మహాలక్ష్మిదేవిపేట ఏలూరు జిల్లాలో ఉంది.