ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను తితిదే ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. అదనపు ఈవో ధర్మారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలసి నాలుగు మాడవీధులను పరిశీలించిన ఈవో... అన్నమయ్య భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన తితిదే ఈవో - చిత్తూరు తాజా వార్తలు
ఏపీలోని తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను తితిదే ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో...ఉత్సవాల నిర్వహణపై పునరాలోచన చేస్తున్నారు.
గత నెలలో జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించిన తితిదే.... నవరాత్రి ఉత్సవాలను భక్తుల మధ్య తిరువీధుల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. సామాజిక దూరం పాటిస్తూ... గ్యాలరీల నిర్మాణం చేపట్టి... మార్కింగ్ కూడా చేశారు. తాజాగా చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఉత్సవాల నిర్వహణపై పునరాలోచన చేస్తున్నారు. జిల్లా యంత్రాంగంతో పాటు తితిదే ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న ఈవో... బ్రహోత్సవాల నిర్వహణపై త్వరలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.