TSRTC Ugadi Offer: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ తీపికబురు చెప్పింది. ఉగాది పర్వదినాన ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చే విధంగా మూడు రాయితీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఉగాది రోజున 65 ఏళ్లు పైబడిన వయోజనులకు పల్లెవెలుగు నుంచి గరుడ ప్లస్ వరకు ఏ బస్సుల్లోనైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఆధార్ లేదా వయస్సు ధృవీకరణ పత్రం ఏదైనా చూపించి బస్సుల్లో ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.
TSRTC Ugadi Offer: ఉగాది సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్ - తెలంగాణ ఆర్టీసీ వార్తలు
TSRTC Ugadi Offer: వినూత్న కార్యాచరణతో ప్రయాణికులకు చేరువవుతున్న టీఎస్ఆర్టీసీ ఉగాది పండగ సందర్భంగా బంపర్ ఆఫర్లను ప్రకటించింది. కొత్త ఆలోచలకు శ్రీకారం - సరికొత్త ఆశయాలకు ప్రాకారంగా నిలిచే ఉగాది నాడు మరికొన్ని రాయితీలిచ్చి ప్రయాణికులను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది.
ఎంత దూరమైనా రాయితీ..:అలాగే కార్గో, పార్శల్ సర్వీస్ వినియోగదారులకూ మేలు చేకూర్చే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 5 కిలోల బరువున్న పార్శిల్స్ బుకింగ్ ఛార్జీలపై 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. ఆయా ప్రత్యేక రోజుల్లో ఎంత దూరం పంపించే పార్శల్ అయినా రాయితీ వర్తిస్తుందని తెలిపారు. అంతేకాకుండా విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్ బస్సుల్లో అప్ అండ్ డౌన్ టిక్కెట్‌పై తిరుగు ప్రయాణంలో 20 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు చెప్పారు. 20 శాతం రాయితీని 10 రోజుల్లోపు ఎప్పుడైనా వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీచూడండి:Yadadri: యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలు నిషేధం.. ఉచితంగా భక్తుల తరలింపు