నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో తెరాస మరోసారి విజయం సాధిస్తుందని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన ముస్లిం ప్రజాప్రతినిధులు.. మంత్రుల క్వార్టర్స్‌లో మహమూద్ అలీని కలిశారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్.. అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తారని మహమూద్ అలీ అన్నారు.
సాగర్ ఉపఎన్నికల్లో తెరాసదే విజయం: మహమూద్ అలీ - telangana latest news
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో తెరాసదే మళ్లీ విజయమని హాంశాఖ మంత్రి మహమూద్ అలీ జోస్యం చెప్పారు. సాగర్‌కు చెందిన ముస్లిం ప్రజాప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు.
తమ నియోజకవర్గంలోని సమస్యలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సాగర్‌లో సుమారు 18,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారని.. ఆరు మండల కేంద్రాల్లో షాదీఖానాలను నిర్మించాల్సిన అవసరం ఉందని హోంమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మసీదుల్లోని ఇమాంలకు, వక్ఫ్ బోర్డు నుంచి వేతనం ఇచ్చే అంశాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. సయ్యద్ మియాన్, మదార్ షా , కోఆప్షన్ సభ్యులు అహ్మది, బషీర్, అబ్బాస్ హోం మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
ఇవీచూడండి:రైల్వేలో తెలంగాణకు నిరాశ.. మొక్కుబడిగా కేటాయింపులు