మహారాష్ట్రాలో త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. నాందేడ్ జిల్లాలోని 5 నియోజకవర్గాలు, ఇతర ప్రాంతాల్లోని మరో 3 నియోజకవర్గాలు కలిపి మొత్తం 8 చోట్ల బరిలోకి దిగే అవకాశం ఉంది. హైదరాబాద్ శాసనసభ కార్యాలయంలో సీఎం కేసీఆర్తో నాందేడ్ జిల్లా నేతలు మంగళవారం భేటీ అయ్యారు. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు తమ గ్రామాల్లోనూ అమలుచేయాలని.. వీలుకాని పక్షంలో ఆ గ్రామాలను తెలంగాణలో కలపాలనే నినాదంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. తమకు తెరాస టికెట్లు ఇవ్వాలని కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు గులాబీ అధినేత సూత్రపాయంగా అంగీకరించినట్లు సమాచారం. త్వరలో భాజపా, కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ తదితర పార్టీల స్థానిక నాయకులతో వచ్చి కలుస్తామని నాందేడ్ నేతలు తెలిపారు.
ఎనిమిది స్థానాలపై గురి