తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రైవేట్​ ఉపాధ్యాయులను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యాసంస్థలదే'

రాష్ట్ర ప్రైవేట్ సాంకేతిక కళాశాలల లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల సంఘం ప్రతినిధులు ప్రణాళిక సంఘం అధ్యక్షులు వినోద్ కుమార్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రతి నెలా జీతాలు చెల్లించి ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్ లను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులకు ఉందని... ఈ విషయాన్ని ఎవరూ విస్మరించకూడదని వినోద్ కుమార్ సూచించారు.

'ప్రైవేట్​ ఉపాధ్యాయులను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యాసంస్థలదే'
'ప్రైవేట్​ ఉపాధ్యాయులను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యాసంస్థలదే'

By

Published : Sep 6, 2020, 6:38 PM IST

గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఫ్రొఫెసర్లకు ప్రతి నెలా జీతాలు చెల్లించి.. వారిని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ఆయా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు ఉందని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రైవేట్ సాంకేతిక కళాశాలల లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల సంఘం ప్రతినిధులు వినోద్ కుమార్​ను అధికారిక నివాసంలో కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. వివిధ రంగాల్లో నిపుణులు, ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించక పోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

స్కిల్స్ ఉన్న వీళ్ళు ఇతర రంగాలకు తరలిపోతే టీచింగ్ రంగానికి తీరని నష్టం జరుగుతుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి నెలా జీతాలు చెల్లించి ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్ లను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులకు ఉందని... ఈ విషయాన్ని ఎవరూ విస్మరించకూడదని వినోద్ కుమార్ సూచించారు. తెలంగాణ విద్యా చట్టంలోని సెక్షన్ 84లో సమూల మార్పులతో జీతాలను ఛార్జ్ చేసే విధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు వినోద్​ తెలిపారు. ఈ ప్రతినిధి బృందంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐనేని సంతోశ్​ కుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్ ఉమాదేవి, కార్యదర్శులు రాజు, నరేశ్​, మదన్, తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి:"నా సొరకాయలు పోయాయి సార్..!"

ABOUT THE AUTHOR

...view details