TRS Candidate Gayatri Ravi : రాజ్యసభ ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఒక స్థానానికి సభ్యుడిని ఎన్నుకునేందుకు జరుగుతున్న ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన ఇవాళ జరిగింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ సమక్షంలో రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి పరిశీలన చేపట్టారు. మొత్తం మూడు నామినేషన్లు దాఖలు కాగా.. రెండు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
తెరాస అభ్యర్థి గాయత్రి రవి ఎన్నిక ఏకగ్రీవం!
TRS Candidate Gayatri Ravi : రాజ్యసభ ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఒక స్థానానికి మొత్తం ముగ్గురు నామినేషన్లు వేయగా.. రెండు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఉపఎన్నిక బరిలో రవిచంద్ర మాత్రమే మిగిలారు.
TRS Candidate Gayatri Ravi
శ్రమజీవి పార్టీ అభ్యర్థి జాజుల భాస్కర్, స్వతంత్ర అభ్యర్థి బోజరాజు కోయల్కర్ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఉపఎన్నిక బరిలో తెరాస అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర మాత్రమే మిగిలారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సోమవారం మధ్యాహ్నం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి రవిచంద్రకు ధ్రువీకరణ పత్రం అందిస్తారు.