రాష్ట్రంలో మరో విదేశీ సంస్థ.. భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో మరో భారీ పెట్టుబడిని రాష్ట్రం ఆకర్షించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దిగ్గజ సంస్థ అయిన ట్రిటాన్ ఈవీ.. రాష్ట్రంలో 2100 కోట్ల పెట్టుబడితో వరల్డ్ క్లాస్ ఈవీ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది.
తెలంగాణలో భారీ పెట్టుబడులు... రూ.2100 కోట్లతో ట్రిటాన్ ఈవీ పరిశ్రమ - లక్ట్రిక్ వాహనాల రంగం
18:08 October 07
రాష్ట్రం ప్రభుత్వంతో ట్రిటాన్ ఈవీ పరిశ్రమ ఎంవోయూ..
ఈమేరకు కంపెనీ సీఈవో హిమాన్షు పటేల్‌తో కూడిన ప్రతినిధుల బృందం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి.. అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీల తయారీలో గ్లోబల్‌గా పేరుగాంచిన ట్రిటాన్ కంపెనీ.. ట్రిటాన్ ఈవీతో గ్లోబల్‌గా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు చేపడుతోంది.
పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్నందుకు ట్రిటాన్ ఈవీ సీఈవోకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమ ఏర్పాటు కొరకు జహీరాబాద్‌లోని నిమ్జ్‌ను పరిశీలించాలని కోరారు. మంత్రి సూచన మేరకు.. ట్రిటాన్ ప్రతినిధులను ప్రత్యేక ఛాపర్లో జహీరాబాద్ నిమ్జ్‌కు తీసుకెళ్లి స్థల పరిశీలన చేయించారు.
ప్రస్తుతం యూఎస్ కేంద్రంగా ట్రిటాన్ ఈవీ కార్లు తయారవుతున్నాయి. పరిశ్రమ ఏర్పాటుకు ల్యాండ్ ఎంపిక పూర్తయితే.. త్వరలోనే ఓ భారీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ తెలంగాణ కేంద్రంగా పనిచేయనుంది. ఆపై తెలంగాణ నుంచి ఈవీ కార్లు గ్లోబల్‌గా ఎగుమతి కానున్నాయి.
ఇదీ చూడండి: