మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్థంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని పీవీ ఘాట్ వద్ద పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, మాజీ మంత్రి గీతారెడ్డి, పొన్నాల, వీహెచ్‌తో పాటు పలువురు నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని ఉత్తమ్ తెలిపారు. పీవీ అమలు చేసిన సంస్కరణల వల్లే దేశం ఆర్థికంగా నిలబడిందని కొనియాడారు.
పీవీకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం: ఉత్తమ్
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌లో కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
uttam
భూ సంస్కరణలు తీసుకొచ్చి చరిత్రలో నిలిచిపోయేలా దేశాన్ని ప్రగతిపథంలో నడిపించారు. పీవీ తీసుకొచ్చిన సంస్కరణల వల్లనే దేశం ఆర్థికంగా నిలబడింది. పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాదంతా ఘనంగా నిర్వహిస్తున్నాం: ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇవీ చూడండి: 'పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం'
Last Updated : Dec 23, 2020, 12:30 PM IST