తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రజారోగ్యంపై కేసీఆర్​కు చిత్తశుద్ధి లేదు: ఉత్తమ్

కాంగ్రెస్​ను కరోనాతో పోల్చడంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్​కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్​ వెంటనే క్షమపణ చెప్పాలని.. అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అసలు కరోనా కేసీఆర్​ అని ఉత్తమ్​ విమర్శించారు.

uttam kumar reddy
uttam kumar reddy

By

Published : Mar 15, 2020, 4:48 PM IST

కాంగ్రెస్‌ కరోనా లాంటిదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ తీవ్రంగా స్పందించింది. అసలు కరోనా కేసీఆర్‌ అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. హస్తం పార్టీ దేశానికి కన్నతల్లి లాంటిదని అభివర్ణించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కరోనాతో పోల్చడం ముఖ్యమంత్రి సంస్కారలేమికి నిదర్శనమని ఆరోపించారు.

కేసీఆర్​కు అవగాహన లేదు

పారాసిటమాల్ గోళితో కరోనా తగ్గిపోతుందని కేసీఆర్ చెప్పడం చూస్తే.. ప్రజారోగ్యంపై ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. ప్రపంచాన్ని కరోనా హడలెత్తిస్తుంటే... చాలా చిన్న సమస్యని చెపడం బాధ్యతా రాహిత్యమేనని తెలిపారు.

కాంగ్రెస్​పై చేసిన వ్యాఖ్యలను కేసీఆర్‌ ఉపసంహరించుకోవాలని, అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. హస్తం పార్టీకి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ముఖ్యమంత్రే అలాంటి మాటలంటే ఎలా..: కాంగ్రెస్​

ABOUT THE AUTHOR

...view details