తెరాస ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. పంచాయతీ రాజ్‌కు సరైన నిధులు, విధులు ఇవ్వడం లేదని ఉత్తమ్ ఆరోపించారు. ఇందుకు నిరసనగా... ఈనెల 22న కాంగ్రెస్ అనుబంధ సంస్థ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద సత్యాగ్రహా దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు: ఉత్తమ్ - uttam kumar about Panchayati raj act in telangana
ఈనెల 22న కాంగ్రెస్ అనుబంధ సంస్థ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద సత్యాగ్రహా దీక్ష చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తెలిపారు. సత్యాగ్రహ దీక్షకు మధ్యప్రదేశ్ పార్లమెంట్ సభ్యురాలు మీనాక్షి నాటరాజన్ పాల్గొంటారని ఉత్తమ్ తెలిపారు.
tpcc chief uttam kumar reddy about Panchayati Raj act
పంచాయతీరాజ్ ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు సరైనా విధులు, నిధులు కేటాయించాలని... వారికి న్యాయం చేసే విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో దీక్ష చేస్తామన్నారు. సత్యాగ్రహ దీక్షకు మధ్యప్రదేశ్ పార్లమెంట్ సభ్యురాలు మీనాక్షి నాటరాజన్ పాల్గొంటారని ఉత్తమ్ తెలిపారు.