1. సర్కార్కు చిత్తశుద్ధి లేదు
ఎన్నికలు వస్తున్నాయనే సీఎం కేసీఆర్ ఉద్యోగాల హడావుడి చేస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. జోనల్ వ్యవస్థ లేకుండా.. ఉద్యోగాల భర్తీ చేయలేరని తెలిసిన కేసీఆర్.. దిల్లీకి వెళ్లి కూడా జోనల్ వ్యవస్థ మీద స్పష్టత ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. శిక్షణా శిబిరం ప్రారంభం
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడలోని ఆర్వీకే కేంద్రంలో కార్యకర్తలకు శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. దానిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. చాయ్ దుకాణంలో కారు
హైదరాబాద్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. చాయ్ దుకాణంలోకి కారు దూసుకెళ్లగా... ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రైవర్ 70 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఖైదీలకు ఉపాధి
ఖైదీలకు భరోసా ఇవ్వడానికి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేపడతున్నామని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రిజిస్ట్రేషన్లకు కొత్త విధానం
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించినా... సమస్య తీరేలా కనిపించడం లేదు. ధరణి పోర్టల్ నిర్వహణకు గాను దాదాపు 100రోజుల క్రితం రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన ప్రభుత్వం... కోర్టు ఆదేశాలతో ప్రారంభించింది. కానీ రిజిస్ట్రేషన్లకు ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ఆటంకంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.