1. పాక్-హ్యాక్!
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులు హ్యాక్ చేశారు. వెబ్సైట్లో పాకిస్థాన్ అనుకూల నినాదాలతో పాటు, భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సందేశాలు పెట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున వెబ్సైట్ హ్యాక్‌కు గురికాగా.. మంగళవారం ఈ విషయాన్ని కిషన్ రెడ్డి కార్యాలయం ధ్రువీకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. సీఎల్పీ యాత్ర
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలని సీఎల్పీ నిర్ణయించింది. రేపటి నుంచి వచ్చే నెల అయిదో తేదీ వరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో సందర్శించనున్నారు. ఆస్పత్రుల వారిగా క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు ఈ సందర్శన కార్యక్రమాన్ని చేపట్టినట్లు భట్టి వివరించారు. సందర్శన అనంతరం ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. భారీగా గంజాయి..
భద్రాచలంలోని అంబేడ్కర్ సెంటర్లో సీఐ వినోద్ రెడ్డి, ఎసై మహేష్ తనిఖీలు నిర్వహిస్తుండగా భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. ఒక కారు, వ్యాన్లలో 637 కిలోల గంజాయిని... తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.95.60 లక్షలు ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. బంగాల్పై గురి
మూడంటే మూడు... 2016లో బంగాల్ శాసనసభ ఎన్నికల్లో భాజపా దక్కిన సీట్ల సంఖ్య. కానీ... 2021లో మాత్రం కనీసం 220 స్థానాలు గెలుచుకుని, అధికారం చేపట్టాలని భావిస్తోంది కమలదళం. అందుకు అనుగుణంగా పక్కా ప్రణాళిక అమలు చేస్తోంది. వినేందుకు ఘనంగా ఉన్నా... ఇంతటి భారీ లక్ష్యాన్ని చేధించడం ఆచరణ సాధ్యమేనా? ఇందుకోసం భాజపా అనుసరిస్తున్న వ్యూహాలేంటి? ప్రత్యర్థి మమతా బెనర్జీని ఢీకొట్టే కమలదళ సారథి ఎవరు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రికవరీలే ఎక్కువ
కరోనా మరణాల రేటు భారత్‌లోనే తక్కువగా ఉందని కేంద్ర వైద్య శాఖ స్పష్టం చేసింది. మరణాల రేటు 1.5శాతంగా ఉన్నట్లు తెలిపింది. యాక్టివ్ కేసుల కన్నా కోలుకున్న వారి సంఖ్య 3.4రెట్లు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. రికవరీ రేటు 75.92 శాతానికి చేరినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.