1. 'మోదీ లద్దాఖ్ పర్యటన చైనాకు గట్టి హెచ్చరిక!'
దేశ ఉత్తర సరిహద్దులో ప్రతిష్టంభన ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న తరుణంలో ప్రధాని మోదీ చేపట్టిన లద్దాఖ్ పర్యటన చాలా ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు. చైనా దూకుడుకు దీటుగా భారత్ తన వైఖరిని స్పష్టం చేసిందని అంటున్నారు. చర్చల్లో పురోగతి లభించకపోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని మోదీ పర్యటన ద్వారా విస్పష్ట సందేశాన్ని చైనాకు ఇచ్చినట్లు విశ్లేషిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. టిమ్స్ సిద్ధం.. ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన మంత్రులు
హైదరాబాద్‌లో అధునాతన సౌకర్యాలతో కొవిడ్-19 రోగుల కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ప్రారంభానికి సిద్ధమైంది. మంత్రి ఈటల రాజేందర్ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. దానిని మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. మొత్తం 1,224 పడకలు ఉండగా.. 1000 పడకలకు ఆక్సిజన్, 100కి వెంటిలేటర్ సౌకర్యం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఆన్‌లైన్ క్లాస్‌ల నిర్వహణపై కసరత్తు
రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ బోధన అయోమయంగా మారింది. కార్పొరేట్ పాఠశాలలు ఆన్ లైన్ పాఠాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. మరోవైపు నేటి నుంచి టీవీ ద్వారా డిగ్రీ పాఠాల బోధన ప్రారంభించిన ఎస్సీ గురుకుల సొసైటీ.. ఆగస్టు 3 నుంచి పాఠశాల విద్యార్థులకూ ప్రసారం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ బడుల విద్యార్థులకు టీశాట్, దూరదర్శన్ ద్వారా బోధన ఎప్పటి నుంచో కొనసాగుతున్నప్పటికీ... ఆశించిన ప్రయోజనాలు అందడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. రాచకొండ పరిధిలో 53 మంది పోలీసులకు కరోనా
రాచకొండ కమిషనరేట్ పరిధిలో 53 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. వైరస్ బారి నుంచి 7మంది కోలుకున్నారని పేర్కొన్నారు. మిగిలిన సిబ్బంది త్వరలో కోలుకుంటారని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రానున్న మూడు రోజులు మెరుపులతో కూడిన వర్షం
రాగల మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.