తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOPTEN NEWS @ 3PM
టాప్​టెన్​ న్యూస్​ @ 3PM

By

Published : Jul 19, 2021, 2:59 PM IST

వాయిదాల పర్వం

లోక్​సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్ష సభ్యుల ఆందోళనతో తొలుత మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడిన సభ.. తిరిగి భేటీ అయిన తర్వాత కూడా సజావుగా సాగలేదు. దీంతో సభను మధ్యాహ్నం 3.30కు వాయిదా వేశారు స్పీకర్ ఓంబిర్లా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ఆ​ వార్తలు అవాస్తవం!'

దేశంలోని ప్రముఖుల ఫోన్లను 'పెగాసస్' అనే స్పైవేర్ సాయంతో హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలను ఆ సాఫ్ట్​వేర్​ను విక్రయించే ఎన్ఎస్ఓ గ్రూప్ ఖండించింది. తమ సర్వర్ల నుంచి డేటా లీక్ అయిన విషయం అవాస్తవమని తెలిపింది. కథనంలో పేర్కొన్న సమాచారం తమ సర్వర్లలోనే లేదని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'80% కేసులకు అదే కారణం'

దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 80శాతానికి పైగా కేసులకు డెల్టా వేరియంటే కారణమని సార్స్ ​కొవ్​- జీనోమ్ కన్సార్టియమ్ అధిపతి ఎన్​కే అరోడా తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఖాళీలపై హరీశ్ రావు సమీక్ష

అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్షిస్తున్నారు. ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐదు రోజుల్లోగా ఆర్థికశాఖకు అందించాలని కేబినెట్ ఇటీవల ఆదేశించింది. ఐదు రోజులు పూర్తయిన నేపథ్యంలో మంత్రులు, అధికారులతో హరీశ్ చర్చిస్తున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'తక్షణమే వేతనాలివ్వాలి'

ఆర్టీసీలో సమయానికి వేతనాలు అందక ఇబ్బందులు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్టీసీ జేఏసీ(RTC JAC) ఛైర్మన్‌ హన్మంత్‌ తెలిపారు. 29 డిపోల కార్మికులు ఆర్థిక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జీతాలు అందించాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మరో మూడు ఫ్లై ఓవర్లు

భాగ్యనగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పించడం కోసం మరో మూడు ఫ్లైఓవర్లు(Flyovers) రాబోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే సుచిత్ర-దూలపల్లి, డైరీఫాం జంక్షన్ల వద్ద మూడు పైవంతెనలు నిర్మించనున్నట్లు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' మరుగునపడ్డ ప్రతిభకు గుర్తింపు'

తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అధ్యాపకుడు ఆయన. పల్లెల్లోని సామాజిక స్థితిగతులు, మనుషుల ఆవేదన, ఆక్రందనలు తెలిసిన ఆచార్యుడు. అందుకే మలి ఉద్యమ సమయంలోనూ కీలకపాత్ర పోషించిన ఆ పెద్దాయన... సమాజ హితం కోసం తన కలాన్ని కదిలిస్తూనే ఉంటారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఖరీదైన్ పెన్​ గురూ!

బెంగళూరులోని విలియమ్​ పెన్స్​ సంస్థ ఖరీదైన పెన్నులను విక్రయిస్తోంది. ఇందులో అత్యధికంగా రూ.7 లక్షలు విలువ చేసే పెన్​​.. చూపరులను ఆకర్షిస్తోంది. రూ.10వేలు, రూ.35వేల ఖరీదైన వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారని నిర్వాహకులు వెల్లడించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఏమిటా 'పెగాసస్‌'..!

కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్ల హ్యాకింగ్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్యనీయాంశంగా మారింది. పెగాసస్​ స్పైవేర్ సాయంతో ఈ హ్యాకింగ్​ జరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ ఏమిటీ పెగాసస్​? ఇది ఎలా పని చేస్తుంది? దీనిని ఎవరు రూపొందించారు?

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రవితేజకు ఇద్దరు హీరోయిన్స్​

సినీ అప్డేట్స్​ వచ్చేశాయి. రవితేజ, రామ్​పోతినేని, సూర్య, విద్యుత్​ జమ్వాల్​, ఆయుష్మాన్​ ఖురానా చిత్రాలకు సంబంధించిన కొత్త సంగతులు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details