1. మహాత్ముని స్మరణ..
హైదరాబాద్లోని బాపూ ఘాట్ వద్ద నేతలు నివాళులర్పించారు. గవర్నర్ సహా మంత్రులు మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించారు. గాంధీజీ ఆదర్శప్రాయ వ్యక్తిత్వాన్ని నేతలు స్మరించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఊరుకోం..
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో.. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భద్రాద్రి సీతారామున్ని దర్శించుకున్న మంత్రి.. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.పోరాడతాం..
అందరి జీవితాల్లో శుభకార్యాలకు వాడే పసుపు.. దాన్ని పండించే రైతుల జీవితాలకు ఉరితాడుగా మారుతోందని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు పంటకు మద్ధతు ధరతో పాటు బోర్డు ఏర్పాటు చేస్తానన్న భాజపా ఎంపీ అర్వింద్ హామీ నిలుపుకోవాలంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ రైతు భరోసా దీక్ష చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. విడిగా బతకలేక..
ఒకరినొకరు ఇష్టపడ్డారు. కలిసే జీవితాంతం బతికాలని ఆశపడ్డారు. విధి వారిద్దరినీ విడదీసింది. వారి ఆశలను సమాధి చేసింది. తప్పక.. ఇటీవలే ఇద్దరూ వేరేవాళ్లను మనువాడారు. పెళ్లి పీఠలైతే ఎక్కారు.. కానీ వేరేవాళ్లతో జీవితాన్ని పంచుకోలేకపోయారు. పెళ్లి కలవలేకపోయిన వాళ్లు చావుతో ఒక్కటవ్వాలి అనుకున్నారు. ఒకే చున్నీకి కలిసి ఉరేసుకున్నారు. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్లోని పడారుపల్లిలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. అఖిలపక్షం..
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన అఖిలపక్షం భేటీ అయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ అజెండాను ఇందులో మోదీ వివరించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.