1. వంటిమామిడి నుంచి
కలెక్టర్లు, సంక్షేమ శాఖల కార్యదర్శులు, గురుకులాల కార్యదర్శులతో సీఎస్ సోమేశ్‌కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గురుకులాలు, వసతి గృహాలకు నాణ్యమైన కూరగాయల సరఫరాపై అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, వసతి గృహాలకు వంటిమామిడి నుంచి కూరగాయలు సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. నడిరోడ్డుపైనే లంచం..
ఆదిలాబాద్ పట్టణంలో నడిరోడ్డుపై లంచం తీసుకుంటున్న పంచాయతీ ఏఈని అనిశా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. చిన్నారులెక్కడ..?
రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యం, వ్యభిచారానికి సంబంధించిన 8 పిల్స్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీల ఏర్పాటులో జాప్యంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మండిపోతాయ్..
జనవరి చివరాంకంలోనే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. మార్చి, ఏప్రిల్ మాసాల్లో కాయాల్సిన ఎండలు ఇప్పుడే ఠారెత్తిస్తున్నాయి. ఉత్తర, వాయువ దిక్కుల నుంచి గాలుల ప్రభావం లేకపోవడం వల్లే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ప్రసంగం బహిష్కరణ..!
పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి శుక్రవారం చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరించనున్నట్లు 16 విపక్ష పార్టీలు ప్రకటించాయి. సాగు చట్టాలను బలవంతంగా ఆమోదించడానికి నిరసనగా ఇలా చేస్తున్నట్లు రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.