1. మేలో పరీక్షలు!
కరోనా ప్రభావం వల్ల రాష్ట్రంలో సుదీర్ఘంగా మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 9, 10వ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 9, 10 తరగతుల క్యాలెండర్‌ను విద్యాశాఖ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ట్యాంక్‌బండ్ సూపర్..
ట్యాంక్‌బండ్ పరిసరాల్లో సుందరీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. అందమైన దీపాలు, పాదచారుల దారులను సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతున్నారు. సుందరీకరణ పనులను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఎక్కడా అలా అనలేదు..
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలో పసుపు రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. పసుపు బోర్డు, మద్దతు ధరపై చర్చిస్తున్నారు. 5 రోజుల్లో తెస్తానని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అంతా వ్యవసాయమే..
ఎన్ని పరిశ్రమలు వచ్చినా.. వ్యవసాయమే ప్రధాన ఆధారమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తునికిలో డాక్టర్ రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రంలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. వచ్చే నెలలో రామగుండం ఎరువుల పరిశ్రమను ప్రధాని ప్రారంభిస్తారని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. అఖిల విడుదల..
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ చంచల్‌గూడ మహిళా జైలు నుంచి కాసేపట్లో విడుదల కానున్నారు. ఆమెకు సికింద్రాబాద్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.