1. ఎక్కడైనా విజయం మాదే..
దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ విజయదుంధుబి మోగిస్తుందని.... ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో తెరాస, మజ్లిస్ పార్టీలు మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాయన్న ఆయన.... 2023లో భాజపానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కాంగ్రెస్ మద్దతు
రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. భారత్ బంద్‌లో కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ప్రత్యేక సమావేశం
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన 11వ రోజు కొనసాగుతోంది. మరోవైపు కర్షకుల నిరసనలకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో సమస్య పరిష్కారం కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. పీఓకేలోకి బాలికలు..
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)కు చెందిన ఇద్దరు బాలికలు ఆదివారం తెల్లవారుజామున సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించారు. అయితే.. వారు పొరపాటును ఇలా వచ్చినట్లు గుర్తించాయి భద్రతా దళాలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. తిరుగు ప్రయాణం
చైనా ప్రతిష్టాత్మక మిషన్ చాంగే-5లో మరో కీలక ఘట్టం ముగిసింది. చంద్రుడి ఉపరితలంపై మట్టి, రాళ్ల నమూనాలను సేకరించిన అసెండర్.. ఆదివారం ఆర్బిటర్‌తో అనుసంధానమైంది. ఆ నమూనాలను విజయవంతంగా ఆర్బిటర్‌లోకి చేర్చింది. ఇక సరైన సమయం చూసుకుని భూమికి తిరిగివచ్చేందుకు ఎదురుచూస్తోంది చాంగే-5. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.