1. బండికి మోదీ ఫోన్..
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫోన్ చేశారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పార్టీ క్యాడర్ నూతనోత్సాహంతో నడుచుకోవడం పట్ల ప్రధాని హర్షం చేశారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అమ్మా ఇంటికి పోదాం..
చుట్టూ మృతదేహాలు... ఓ పిల్లాడు. అమ్మ శవం పక్కన కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకి పోయాయి. అయినా అమ్మ లేవట్లేదు. ఇంటికెళ్దాం అమ్మా అంటూ ఏడుపు.. ఈ దృశ్యం చూస్తే ఎవరి మనసునైనా కలిచి వేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మరో ఉన్మాదం..
రోజూ ఏదో ఒక చోట మహిళలపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. యువతిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేశాడు. యువతి ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. రూ.68 లక్షల కోట్ల అప్పులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్రాల అప్పులు భారీగా పెరగొచ్చని క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. కరోనాతో తగ్గిన ఆదాయం, పెరిగిన వ్యయాల వల్ల రాష్ట్రాల అప్పులు రూ.68 లక్షల కోట్లకు చేరొచ్చని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఫైనల్ ట్రయల్స్
దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్-కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోల్‌కతా, బెంగళూరులో బుధవారం ప్రారంభమయ్యాయి. బంగాల్లో గవర్నర్ జగదీప్ ధన్ఖర్, కర్ణాటకలో సీఎం యడియూరప్ప వ్యాక్సిన్ ట్రయల్స్‌ను ప్రారంభించారు. తుది దశ ప్రయోగాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.