1. అఖిలక్ష భేటీ
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. గ్రేటర్ పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితా సవరణపై సూచనలు స్వీకరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. థియేటర్ల సమస్యలు..
కరోనాతో 6 నెలలుగా ఎంతో నష్టపోయామని థియేటర్ల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 15 నుంచి థియేటర్లు తెరిచినా ఒకేసారి ప్రేక్షకులు రారన్నారు. నిర్వాహకులకు కొన్నాళ్లపాటు ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. నన్నెవరూ ఆపలేరు..
ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎంపీల బృందం హాథ్రస్‌కు వెళ్లనున్నట్టు ఆ పార్టీ తెలిపింది. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. దుఃఖంలో ఉన్న బాధితురాలి కుటుంబసభ్యులకు ఓదార్పు అందించకుండా ప్రపంచంలో ఏ శక్తీ తమను అడ్డుకోలేదని ట్విట్టర్లో పేర్కొన్నారు రాహుల్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. నో ఎంట్రీ..
ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్లో హత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు రాజకీయ నేతలకు అనుమతులు లేవని అధికారులు తెలిపారు. గ్రామంలో సిట్ దర్యాప్తు పూర్తయిన క్రమంలో ప్రస్తుతానికి మీడియాకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. 144 సెక్షన్ అమలులోనే ఉందన్నారు. అయితే.. ఇవాళ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు హాథ్రస్‌కు వెళ్లనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. క్షిపణి సక్సెస్
బాలాసోర్‌లో శనివారం శౌర్య న్యూక్లియర్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది భారత్. ఉపరితలం నుంచి ఉపరితలంలోని 800 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఈ మిసైల్ ఛేదించగలదని రక్షణశాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.