తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @3pm
టాప్​టెన్​ న్యూస్ @3pm

By

Published : Jul 8, 2020, 3:19 PM IST

1. పూర్తి ఉపసంహరణ

గల్వాన్ లోయ నుంచి పూర్తిస్థాయిలో వెనక్కి తరలాయి చైనా బలగాలు. పాట్రోలింగ్ పాయింట్ 15 నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లాయని సమాచారం. ప్రతిగా భారత సైన్యం కూడా బలగాల ఉపసంహరణ చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. టార్గెట్ చైనా

ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో చైనా ఆధిపత్యం పెరుగుతున్న తరుణంలో... ప్రత్యర్థి విసిరే సవాళ్లను కలిసిగట్టుగా ఎదుర్కోవాలని భారత్​-అమెరికా నిర్ణయించాయి. ఇరు దేశాల మధ్య మంగళవారం జరిగిన వర్చువల్​ సమావేశంలో అధికారులు ఇండో పసిఫిక్​ సహా అంతర్జాతీయ సమస్యలపై ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చలు జరిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. భావితరాల కోసమే..

ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేకున్నా.. కేవలం భవిష్యత్‌ తరాల బాగు కోసమే కేసీఆర్‌ హరితహారం కార్యక్రమం చేపట్టారని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కరీంనగర్‌ జిల్లా వెదురుగట్ట గ్రామంలో హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. సీఎం ఎట్లున్నడో..?

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆరోగ్యంపై గత కొంత కాలంగా వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఎంపీ రేవంత్​రెడ్డి ట్వీట్​ చేశారు. సీఎం ఎలా ఉన్నారో తెలుసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని... వెంటనే కేసీఆర్​ ఆరోగ్యంపై హెల్త్​ బులిటెన్​ విడుదల చేయాలని ట్విట్టర్​లో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. గాలి ద్వారా రావొచ్చు..!

గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందనే వాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అంగీకరించింది. అయితే, మరింత పక్కా ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. చిన్న చిన్న తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందన్న వాదనపై చర్చిస్తున్నామని సంస్థ ప్రతినిధి ఒకరన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపిన తర్వాత మార్గదర్శకాల సవరణపై త్వరలో ఓ ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. మహా సంక్షోభం

మహారాష్ట్రలో కొలువుదీరిన మూడుపార్టీల సర్కారు త్వరలోనే కూలిపోనుందా? భాజపా వంటి బయటి శక్తుల ప్రభావం లేకుండానే ప్రభుత్వం పడిపోనుందా? సంకీర్ణ ధర్మం కనుమరుగవడం వల్ల ఠాక్రే పీఠానికి బీటలు వారుతున్నాయా? పరిస్థితులను పరిశీలిస్తే వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రిపై అసంతృప్తి, నిర్ణయాల్లో మంత్రులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. వంటి ఎన్నో పరిణామాలు వీటికి మరింత బలం చేకూరుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. ప్రైవేటు రైలు..?

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్​వర్క్​లలో ఒకటైన​ భారతీయ రైల్వే ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోంది. పలు దేశాల సరళిని పరిశీలిస్తే రైల్వే ప్రైవేటీకరణ అత్యంత సంక్లిష్టమైనదని అర్థమవుతోంది. మరి రైల్వే ప్రైవేటీకరణ విషయంలో భారతీయ రైల్వే పూర్తి సిద్ధంగానే ఉందా? ప్రస్తుతం ఉన్న సమస్యలేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. ఇదే తొలిసారి

అభిమానులు లేకుండా జరిగే ఇంగ్లాండ్​-వెస్డిండీస్​ తొలి టెస్టుకు అంతా సిద్ధమైంది. ఇలా ఓ మ్యాచ్ జరగడం 143 ఏళ్ల చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. దాదా ఘనతలెన్నో..

సౌరభ్ గంగూలీ సారథ్యంలో టీమ్​ఇండియా ఎన్నో విజయాలు సాధించింది. భారత జట్టును ముందుండి నడిపించి.. క్రికెట్​ ప్రపంచంలో మరో స్థాయికి తీసుకెళ్లేందుకు దాదా ఎంతో కృషి చేశాడు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. ఎంట్రీ ఓ సవాల్

బుల్లితెర నుంచి వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వడం ఎన్నో సవాళ్లతో కూడిన విషయమని చెప్పింది నటి హీనా ఖాన్​. గతంలో తాను వివక్షను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. అయితే సుశాంత్ సింగ్​కు మాత్రం ఇండస్ట్రీలో అన్యాయం జరిగిందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details