1. సరిహద్దుపై సమీక్ష
రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్ఓ)తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా వాస్తవాధీన రేఖ, నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను రాజ్‌నాథ్‌కు వివరించారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. సీఎం ఎక్కడున్నారు?
పోలీసుల బందోబస్తు నడుమ సచివాలయం భవనాలను కూల్చివేయడమనేది దుర్మార్గమైన చర్య అంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైఫల్యం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది అంటూ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ట్రా'ఫికర్'
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సచివాలయం కూల్చివేత పనుల్లో భాగంగా వాహనాల దారి మళ్లింపు వల్ల పట్టణంలోని ప్రధాన రహదారుల వద్ద వాహనాల రద్దీ నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కరోనాతో అవకాశాలు..
కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులు తమకు అనేక సవాళ్లతో పాటు.. కొత్త కొత్త అవకాశాలను కూడా కల్పించినట్లు టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. వీటన్నింటినీ తట్టుకుని భవిష్యత్‌లో మరింత బలంగా ఎదుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు చంద్రశేఖరన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. వరద ప్రళయం
జపాన్ వరదల్లో మృతుల సంఖ్య 50కు చేరింది. ఇప్పటికీ కొంతమంది ఆచూకీ తెలియలేదని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.