తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ ​న్యూస్@3PM - ts news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @3pm
టాప్​టెన్ ​న్యూస్@3PM

By

Published : Jul 6, 2020, 2:58 PM IST

1. ఆ కుటుంబంలో 16 మంది జవాన్లే.!

ఇంట్లో ఒక్కరిద్దరిని సరిహద్దుకు పంపితేనే.. వారక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అనుకుంటూ బిక్కుబిక్కుమని కాలం గడుపుతారు కుటుంబ సభ్యులు. కానీ, కర్ణాటక బెళగావికి చెందిన ఓ కుటుంబం.. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 16 మంది జవాన్లను సరిహద్దుకు పంపినందుకు గర్వంగా భావిస్తున్నారు. అంతే, కాదు, భవిష్యత్తులో ఆ కుటుంబంలోని యువకులందరినీ.. సైనికులను చేయడమే తమ లక్ష్యం అంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. కశ్మీర్​ సైనిక వ్యూహం ఈశాన్యంలో ఫలిస్తుందా?

రాష్ట్రంలో తిరుగుబాటు ముఠాలు పన్నులు వసూలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో తన అధికారాలను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లు నాగాలాండ్ గవర్నర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు గవర్నర్ లేఖ రాయడం వెనక కారణాలేంటి? తిరుగుబాటు సంస్థల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వం అనుసరించాల్సిన మార్గాలేంటనే విషయాలపై సీనియర్ పాత్రికేయులు రాజీవ్ భట్టాచార్య విశ్లేషణ ఇది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. కువైట్​ నుంచి 8 ల‌క్ష‌ల మంది భార‌తీయులు వెన‌క్కి!

దేశంలో ప్రవాసీలను వెనక్కి పంపే బిల్లుకు ఆమోదం తెలిపింది కువైట్ జాతీయ అసెంబ్లీ. ఈ బిల్లు చట్టంగా మారితే అక్కడ నివసిస్తున్న 8 లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి రావాల్సి వస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. దేశవ్యాప్తంగా 'కోటి' దాటిన కరోనా పరీక్షలు

సోమవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 1,00,04,101 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్​ ప్రకటించింది. గత 14 రోజుల్లో సగటుకు రోజున 2 లక్షల నమూనాలను పరీక్షించినట్టు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. 'ప్రభుత్వం ఇకనైనా నిద్రలేవాలి'

హైదరాబాద్‌ మలక్‌పేట్‌లోని ప్రేమిలాథాయ్‌ నగర్‌ బస్తీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం పర్యటించారు. కరోనా నివారణ చర్యలు, ప్రభుత్వ సహాయంపై బస్తీ వాసులను అడిగి తెలుసుకున్నారు. కరోనా కారణంగా ఉపాధి లేక.. కొంత మంది ఇబ్బంది పడుతున్నారని కోదండరాం అన్నారు. కుటుంబానికి రూ.7 వేలిచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. 'నవంబరు నాటికి నర్సాపూర్​ చౌరస్తా పైవంతెన'

నవంబరు నాటికల్లా నర్సాపూర్​ చౌరస్తాలో నిర్మిస్తున్న పై వంతెన​ను అందుబాటులోకి తెస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బాలానగర్​లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి... అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. ఖమ్మంలో ప్రత్యేక టెస్టింగ్​ ట్రాక్​

హైదరాబాద్​తో సమానంగా ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి పువ్వాడ హామీ ఇచ్చారు. ఖమ్మం ఆర్టీవో కార్యాలయంలో ఆరో విడత హరిత హారంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. చైనా కౌంటర్​ ఎటాక్​- 4,500 గేమ్స్​ డిలీట్​

చైనా యాప్ స్టోర్ నుంచి భారీ సంఖ్యలో గేమ్​లను తొలగించింది యాపిల్. చైనా ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగటం వల్ల కేవలం రెండు రోజుల్లో 3 వేలకుపైగా గేమ్​లను తొలగించించింది. మొత్తం మీద 4,500 గేమ్​లను యాప్​ స్టోర్ నుంచి డిలీట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. 'సచిన్​ను ఔట్​కు ఎన్నో వ్యూహాలు రచించాం'

భారత క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ను ఔట్ చేసే వ్యూహంపై ఎన్నోసార్లు జట్టు సమావేశాలు నిర్వహించామని తెలిపాడు ఇంగ్లాండ్ మాజీ సారథి నాసర్ హుస్సేన్. తన కెరీర్​లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాట్స్​మెన్​లలో లిటిల్​ మాస్టర్​ ఒకడని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. పోలీస్ స్టేషన్​కు దర్శకుడు భన్సాలీ

కథానాయకుడు సుశాంత్ సుసైడ్ విషయంతో సంబంధమున్న ఆరోపణల నేపథ్యంలో దర్శకుడు భన్సాలీ స్టేట్​మెంట్​ను పోలీసులు రికార్డు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details