1. చెప్పేది ఒకటి చేసేది ఒకటి.!
కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి కేంద్రం ఓవైపు విశేష ప్రచారం కల్పిస్తోందని.. మరోవైపు ఇందుకు భిన్నంగా చైనా నుంచి ఎక్కువగా దిగుమతులు చేస్తోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మళ్లీ నేపాల్ కవ్వింపులు
భారత సరిహద్దు వెంట కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది పొరుగు దేశం నేపాల్. బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లా వాల్మీకి నగర్ వద్దనున్న గండక్ బ్యారెజీ సమీపంలో రెండు క్యాంపులను ఏర్పాటు చేసింది. ఇటీవల వెనక్కి తగ్గినట్లు కనిపించిన నేపాల్ మరోసారి దుస్సాహసానికి ఒడిగట్టడం సరిహద్దు వెంట ఉద్రిక్తతలను పెంచుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. పునః ప్రారంభం
గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహించే కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. సరోజిని దేవి కంటి ఆస్పత్రి, ప్రకృతి చికిత్సాలయంలో కరోనా పరీక్షలు పునఃప్రాంరంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. సామూహిక ఖననం
కరోనా మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. అయితే ఇది కర్ణాటక బళ్లారి జిల్లాలో జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఫేక్ ట్వీట్
జమ్ము కశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతర్జాలాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నారంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. హోంమంత్రి అమిత్ షా పేరిట సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ట్వీట్ ఫేక్ అని తేల్చిచెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.