1. రాష్ట్రంలో కరోనా
రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో ఇద్దరి మృతితో ఇప్పటివరకు మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,529కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,84,391 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 536 మంది వైరస్ నుంచి కోలుకోగా... మొత్తం 2,76,244 మంది బాధితులు కరోనా నుంచి విముక్తి పొందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఘోర ప్రమాదం
కూలీ పనుల కోసం వెళ్లినవాళ్లపై విధి పగబట్టింది. కూలీ పనుల కోసం బయలుదేరిన వారిని బస్సు, లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆ పేద బతుకులను కబళించింది. పని చేయాల్సిన శరీరాలు ప్రమాదంలో నుజ్జునుజ్జయ్యాయి. విగతజీవులుగా మారిన ఆ కూలీలను చూసి బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. భాజపా నేత హత్య
ఖమ్మం జిల్లా వైరాలో భాజాపా రాష్ట్ర నాయకుడు నేలవెళ్లి రామారావుపై పట్టణానికి చెందిన ఓ యువకుడు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉదయం ఆరు గంటల సమయంలో పాత బస్టాండ్ ప్రాంతంలోని రామారావు ఇంటికి వెళ్లి యువకుడు కత్తితో దాడి చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'కాల్పుల' ఘటనలో వ్యక్తి మృతి
ఈ నెల 18న ఆదిలాబాద్‌లో జరిగిన కాల్పుల్లో గాయపడిన సయ్యద్ జమీర్(52) మృతి చెందాడు. ఆదిలాబాద్ తాటిగూడలో ఎంఐఎం నేత ఫారూఖ్ అహ్మద్... జమీర్ తుపాకీతో కాల్పులు జరపగా, మరి వ్యక్తిపై కత్తితో వీరంగం చేశాడు. తీవ్రంగా గాయపడిన జమీర్... హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. దేశంలో కరోనా..
దేశంలో కొత్తగా 22,272 మంది కరోనా బారినపడ్డారు. మరో 251 మంది కొవిడ్ కారణంగా మరణించారు. దేశవ్యాప్త రికవరీ రేటు 95.78 శాతానికి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.