తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS TODAY : టాప్​టెన్​ న్యూస్​ @1PM - తెలంగాణ తాజా వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS TODAY, telangana news
తెలంగాణ టాప్ న్యూస్

By

Published : Feb 6, 2022, 12:58 PM IST

  • అధికారిక లాంఛనాలతో లత అంత్యక్రియలు

ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత, గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూశారు. వివాదాలకు అతీతంగా, అభిమానులకు సమీపంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం కలిగిన ఆమె మరణంతో సంగీతాభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. లతా మంగేష్కర్ మరణంతో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు జాతీయ సంతాప దినాలు ప్రకటించింది.

  • భారత సంగీత ప్రపంచంలో ఆమెది చెరగని ముద్ర

ప్రముఖ గాయని, భారతరత్న, భారత నైటింగేల్‌గా గుర్తింపు పొందిన లతా మంగేష్కర్ మృతి పట్ల సీఎం కేసీఆర్​, గవర్నర్​ తమిళి సై సంతాపం తెలిపారు. ఆమె భారతీయ సినీ, సంగీత రంగంపై చెరగని ముద్రవేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. లత మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయినట్లు గవర్నర్ తెలిపారు.

  • గాయని లతా మంగేష్కర్ ప్రస్థానం

దిగ్గజ గాయని లతా మంగేష్కర్(92) తుదిశ్వాస విడిచారు. తన పాటలతో కోట్లాది మంది అభిమానులను మనసుల్లో నిలిచిపోయిన లత ప్రస్థానం ఇది...

  • దళిత బాలికపై గ్యాంగ్​ రేప్.. హత్య

దళిత బాలికపై ఇద్దరు దండగులు అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశారు. వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసుల ఎదురకాల్పుల్లో ఓ నిందితుడికి తూటాలు తగిలాయి. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని గోండా జిల్లాలో జరిగింది.

  • వంద శాతం పూర్తి చేసేందుకు చర్యలు: హరీశ్ రావు

రాష్ట్రంలో చేపట్టిన ఫీవర్‌ సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద్యాధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

  • ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య?

కర్ణాటకలోని మండ్యలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

  • పంట దక్కక.. అప్పు తీర్చలేక..

భూమి కౌలుకు తీసుకున్నారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. చెమటోడ్చి కష్టం చేశారు. అయినా వారిపట్ల విధికి చిన్నచూపే. ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. మరోవైపు అప్పులు కుప్పలా పేరుకుపోతున్నాయి. చేసేది లేక... ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు.

  • ఫోన్​ మాట్లాడుతూ మెట్రో ట్రాక్​పై పడిన ప్రయాణికుడు..

ఓ వ్యక్తి ఫోన్​ మాట్లాడుతూ మెట్రో పట్టాలపై పడిపోయాడు. అతడ్ని సెంట్రల్​ ఇండస్ట్రియల్​ సెక్యురిటీ ఫోర్స్​ కానిస్టేబుల్ రక్షించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

  • మొక్కలు నాటిన గుత్తా జ్వాల దంపతులు..

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి గుత్తా జ్వాల దంపతులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్​లోని జీహెచ్​ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మరో ఇద్దరికి ఈ ఛాలెంజ్​ విసిరారు.

  • 'గాడ్​ ఫాదర్​' సెట్​లో చిరు..

కరోనా నుంచి కోలుకుని 'గాడ్​ ఫాదర్'​ సెట్​లో అడుగుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. మరోవైపు 'హరిహర వీరమల్లు' స్క్రిప్ట్​ పనుల్లో బిజీగా గడిపారు పవర్​స్టార్ పవన్‌కల్యాణ్‌.

ABOUT THE AUTHOR

...view details