తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS TODAY : టాప్​టెన్​ న్యూస్​ @1PM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

TOP NEWS TODAY, telangana news
తెలంగాణ టాప్​టెన్​ న్యూస్​

By

Published : Jan 26, 2022, 12:59 PM IST

  • రాజ్​పథ్​లో మువ్వన్నెల జెండా రెపరెపలు

రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. రాజ్​పథ్​లో జరిగిన గణతంత్ర వేడుకల కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా ప్రముఖులు హాజరయ్యారు.

  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం

హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ జెండా ఎగురవేశారు. గాంధీ, అంబేడ్కర్‌ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు సికింద్రాబాద్‌లో సైనికవీరుల స్మారకం వద్ద సీఎం నివాళులర్పించారు.

  • చార్మినార్​ వీధుల్లో మువ్వన్నెల రెపరెపలు

రాష్ట్రంలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భాగ్యనగరం త్రివర్ణ పతాక ఆవిష్కరణలతో నూతన సొబగులు అద్దుకుంది.

  • 'రాజ్యాంగం ప్రజలకు భరోసా'

ప్రజలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నాంపల్లిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొని.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.

  • అచ్చంపేట ఆస్పత్రి ఘటనలో వైద్యులపై సస్పెన్షన్‌ వేటు

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట ఆస్పత్రి ఘటనలో ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్‌ వేటు పడింది. సూపరింటెండెంట్‌ కృష్ణ, డ్యూటీ డాక్టర్‌ హరిబాబును సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన కేసీఆర్

తెలంగాణలోని జిల్లాలకు తెరాస అధినేత కేసీఆర్.. పార్టీ అధ్యక్షులను ప్రకటించారు. 33 జిల్లాలకు తెరాస అధ్యక్షులను నియమించారు. ఏయే జిల్లాలకు ఎవరిని నియమించారంటే..

  • సీఎం వరాల జల్లు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై వారంలో ఐదు రోజులు పనిచేస్తే చాలని ప్రకటించింది ఛత్తీస్​గఢ్​ సర్కార్. పింఛను కోసం ప్రభుత్వం వాటా పెంపు సహా మరికొన్ని వరాలు ఇచ్చింది. రైతులకు కూడా శుభవార్త చెప్పింది.

  • శత్రువులను వణికించే రఫేల్​ 'సివంగి'

భారత 73వ గణతంత్ర వేడుకల వేళ నిర్వహించిన పరేడ్​, శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. రఫేల్​ ఫైటర్​ జెట్​ తొలి మహిళా పైలట్​ శివాంగి సింగ్​.. వాయుసేన శకటంతో కవాతులో పాల్గొన్నారు. 1946 తిరుగుబాటు అంశం థీమ్​తో ప్రదర్శించిన నేవీ శకటం పలువురిని ఆకర్షించింది.

  • క్రిస్​గేల్​కు మోదీ పర్సనల్​ మెసేజ్​!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు వ్యక్తిగత సందేశం పంపారని వెస్టిండీస్ బ్యాటర్​ క్రిస్​గేల్ చెప్పాడు​. భారత దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు ఈ క్రికెటర్.

  • ఆర్జీవీ 'కొండా' ట్రైలర్ రిలీజ్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రవితేజ కొత్త సినిమాల పోస్టర్స్, 'కొండా' ట్రైలర్, ఒక పథకం ప్రకారం, 10th క్లాస్ డైరీస్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details