తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

TOP NEWS TODAY, telangana news
టాప్​టెన్​ న్యూస్

By

Published : Jan 26, 2022, 11:00 AM IST

  • మెగాస్టార్ చిరంజీవికి మరోసారి కరోనా పాజిటివ్

మెగాస్టార్ చిరంజీవికి మరోసారి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారం ట్వీట్ చేశారు. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ట్వీట్​లో పేర్కొన్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉన్నానని రాసుకొచ్చారు.

  • దేశంలో పెరిగిన కరోనా ఉద్ధృతి

భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,85,914 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజులో 665 మంది మరణించారు. 2,99,073 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

  • పక్కా ప్లాన్​తో కొట్టేశారిలా!!

ఆడపిల్లల తల్లిదండ్రులకు వారి పెళ్లి భారం కాకూడదని.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం అందరికీ అందట్లేదు. అసలైన లబ్దిదారుల పేరిట.. ఆధార్ కార్డ్ నంబర్లతో అక్రమార్కులు నిధులు మళ్లీస్తున్నారు. విషయం తెలుసుకున్న అసలు లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం విచారణ చేసి.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

  • 'మంత్రి అఫిడవిట్‌ తొలగింపు'పై ఈసీకి నివేదిక

2018లో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నిబంధనలకు విరుద్ధంగా రెండు అఫిడవిట్లు దాఖలు చేశారని, అందులో ఒకదాన్ని తొలగించారంటూ సి.రాఘవేంద్రరాజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై నివేదిక పంపాల్సిందిగా సీఈసీ తెలంగాణ అధికారులను కోరింది.

  • ఎముకలు కొరికే చలిలో రిపబ్లిక్ డే వేడుకలు

సరిహద్దుల్లో సైనికులు అట్టహాసంగా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించుకున్నారు. తీవ్రమైన చలిలో, ప్రతికూల వాతావరణంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

  • రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలు.. గెలుచుకున్న తెలుగు అధికారులు..

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో సేవలందిస్తున్న పలువురు తెలుగు అధికారులు రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలు గెలుచుకున్నారు. దిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయంలో అదనపు న్యాయసలహాదారుగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం దేవేంద్రన్‌కు రాష్ట్రపతి ప్రతిభా పురస్కారం దక్కింది.

  • 'ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంలో పాక్​ది ప్రపంచ రికార్డు'

ఐరాస వేదికగా పాకిస్థాన్​కు గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. భద్రతా మండలిలో భారత్​పై విషప్రచారం చేసినందుకు దీటుగా బదులిచ్చింది. ఉగ్రవాదులకు సహకరించడంలో పాకిస్థాన్​కు దశాబ్దాల చరిత్ర ఉందని.. ముష్కరులకు ఆశ్రయం కల్పించడంలో ఆ దేశానికి ప్రపంచ రికార్డు ఉందని మండిపడింది.

  • ఆంధ్రలో భారీగా తగ్గిన గాడిదల జనాభా

దేశంలో గాడిదల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. 2012-19 మధ్య ఎనిమిదేళ్లలో 61 శాతం మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్​లో 53 శాతానికిపైగా గాడిదలు తగ్గాయి. చోరీలు, అక్రమంగా వధించడం, అక్రమ రవాణా.. సంఖ్య తగ్గడానికి కారణంగా తెలుస్తోంది.

  • పెళ్లికి ముందే ఇవన్నీ ఆలోచిస్తున్నారా?

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ గొప్ప మలుపు. అమ్మాయి, అబ్బాయి.. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి వివాహం అనే సంప్రదాయంతో ఒక్కటయ్యే మధురమైన వేడుక. ఇలా ఒక్కసారి దాంపత్య బంధంలోకి అడుగు పెట్టాక.. ఇక నిండు నూరేళ్లు ఒకరికొకరు తోడూనీడగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి.

  • బాలయ్య-బోయపాటి కాంబోలో మరో రెండు సినిమాలు?

తనకు అచ్చొచ్చిన హీరో బాలయ్యతోనే మరో రెండు సినిమాలు చేసేందుకు డైరెక్టర్ బోయపాటి రెడీ అవుతున్నారట. త్వరలో ఈ విషయమై స్పష్టత రానుంది.

ABOUT THE AUTHOR

...view details