1. ఓటుకు నోటు కేసు
ఓటుకు నోటు కేసు విచారణ కీలక దశకు చేరింది. నిందితుల్లో ఒకరైన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై అ.ని.శా న్యాయస్థానం విచారణ ప్రక్రియ ప్రారంభించింది. సండ్ర వెంకట వీరయ్యపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12తో పాటు.. ఐపీసీ 120బీ రెడ్విత్ 34 కింద న్యాయస్థానం అభియోగాలను నమోదు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రిజిస్ట్రేషన్ల కార్యాలయాల వర్గీకరణ
వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతంగా ముందుకుతీసుకెళ్లేందుకు పనిచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను వారంలోపే అధిగమిస్తామని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఎల్‌ఆర్‌ఎస్ గుదిబండ
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు పిచ్చి తుగ్లక్ చర్యలను తలపిస్తున్నాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఇకనైనా ప్రజాస్వామ్య బద్ధంగా పాలన కొనసాగించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. దిల్లీకి రేవంత్.. పీసీసీ కోసమేనా?
తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి రేపు ఉదయం దిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు దిల్లీలో జరగనున్న డిఫెన్స్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు హస్తినకు వెళ్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. బాహాబాహీ
కర్ణాటక శాసనమండలిలో సభ్యులు బాహాబాహీకి దిగారు. సభ నిర్వహిస్తున్న.. మండలి ఉపసభాపతి ధర్మగౌడను కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆయన స్థానం నుంచి కిందకు బలవంతంగా లాక్కొచ్చారు. ఆ స్థానంలో మండలి ఛైర్మన్ ప్రతాప్ చంద్ర షెట్టిని కూర్చోబెట్టారు. ఈ క్రమంలో భాజపా- కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.