తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM - latest news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...

top ten news till now
top ten news till now

By

Published : Apr 1, 2021, 2:59 PM IST

1. రెక్కలు విప్పుకుంటున్న కరోనా...

తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా రెక్కలు విప్పుకుంటోంది. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కొత్త కరోనా కేసులు వస్తున్నాయి. అధికారులు ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా.. ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. బహిరంగ ప్రదేశాల్లోనూ మాస్క్ లేకుండా తిరుగుతున్నారు. దీంతో అనుమానిత ప్రాంతాల్లో అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

2. కేసీఆర్​కు వణుకు పుట్టాలి...

హైదరాబాద్‌ భాజపా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్, యువ మోర్చా నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

3. ఒకే తాటి చెట్టుపై 15 మంది...

ఒక తాటి చెట్టు మీద ఇంత మంది గీత కార్మికులు ఎగబడుతున్నారు అదేంటి అనుకుంటున్నారా... దానికి ఓ కారణం ఉంది. ఒకే తాటిచెట్టు కల్లును 15 మంది గీత కార్మికులు కల్లును ఎందుకు కిందకు దింపారో తెలుసుకుందాం రండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

4. కెనడాలో నల్గొండ విద్యార్థి సూసైడ్​...

కెనడాలో నల్గొండ జిల్లా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. డిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్​రావు ఉన్నత చదువుల కోసం 2015లో కెనడాకు వెళ్లాడు. ఇవాళ ఉదయం భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

5. ఉద్రిక్తతల మధ్య బంగాల్​ పోలింగ్​...

బంగాల్​లో కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా.. రెండో దశ పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 58 శాతం ఓటింగ్​ నమోదైంది. పలు ప్రాంతాల్లో భాజపా, తృణమూల్​ కాంగ్రెస్​.. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

6. ఆ పార్టీకి గుణపాఠం చెప్పండి...

తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. డీఎంకే పార్టీ.. మహిళల పట్ల అమర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. సీఎం పళనిస్వామిపై డీఎంకే నేత ఎ.రాజా వ్యాఖ్యలను ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

7. భాజపా నేత ఇంటిపై ఉగ్రదాడి...

జమ్ముకశ్మీర్​కు చెందిన భాజపా నాయకుడు అన్వర్​ ఖాన్​ ఇంటిపై ఉగ్రదాడి జరిగింది. ఉదయం 11.30గంటలకు శ్రీనగర్​లోని ఆయన ఇంటిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

8. ఆ కంప్యూటర్లకు మౌసులుండవటా...

ఒకప్పుడు కంప్యూటర్లు చాలా పెద్దగా ఉండేవి. మారుతున్న కాలంతోపాటు వాటి పరిమాణం, పనితీరులో భారీ మార్పులు వచ్చాయి. రానున్న కాలంలో మరిన్ని మార్పులు ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ విషయంలో యాపిల్ ముందున్నట్లు తెలుస్తోంది. యాపిల్ ఇప్పుడు మౌస్​ అవసరం లేని కంప్యూటర్లు తెచ్చేందుకు పని చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

9. క్రికెటర్ల ఐపీఎల్​ కసరత్తులు...

ఐపీఎల్​ విజయం కోసం అన్ని జట్లు శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రాక్టీస్​ను ముమ్మరం చేశాయి. పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాట్స్​మన్ డేవిడ్ మలన్​ ప్రాక్టీస్​లో సిక్సులు బాదుతూ కనిపించాడు. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ బ్యాట్స్​మన్ డివిలియర్స్​ జట్టుతో కలిశాడు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

10. రష్మిక క్యూట్​ లుక్స్​...

కార్తి, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'సుల్తాన్'. బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో హైలైట్​గా నిలిచింది ముద్దుగుమ్మ రష్మిక. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details