తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు...

top ten news till now
top ten news till now

By

Published : Mar 2, 2021, 4:56 PM IST

1.ఉత్సాహంగా రెండో రోజు...

రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం రెండో రోజున ఉత్సాహంగా సాగింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు.. 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు... టీకా తీసుకున్నారు. ఇక ప్రజాప్రతినిధులు.. పెద్ద సంఖ్యలో టీకా తీసుకుని.. వ్యాక్సిన్‌ పట్ల ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.ముద్రా రుణాల్లో అన్యాయం...

రుణాల మంజూరులో రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​ ఆరోపించారు. ముద్రాా రుణాల్లో జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రికి ఆయన లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.రెవెన్యూ ట్రైబ్యునళ్ల కేసులపై విచారణ...

రెవెన్యూ ట్రైబ‌్యునళ్లలో కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. ట్రైబ్యునళ్లలో విచారణ తర్వాతే వివాదాలు పరిష్కారించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రెవెన్యూ ట్రైబ్యునళ్లలో ఇరువైపులా వాదనలకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.రాజన్న కల నెరవేరలేదు...

వైఎస్ తలపెట్టిన ప్రాజెక్టులను తెరాస ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రాజెక్టులు 90 శాతం పూర్తైనా వాటిని నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.బంగాల్​లో 20, అసోంలో 6...

అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్న తరుణంలో బంగాల్​, అసోంలపై భాజపా మరింత దృష్టి సారించింది. ఈమేరకు బంగాల్​లో 20, అసోంలో 6 ర్యాలీలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రప్పించాలని చూస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.నిరుద్యోగ సమస్యకు కారణం అదే...

నోట్ల రద్దు అనాలోచిత నిర్ణయమని మరోసారి కేంద్రాన్ని విమర్శించారు మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్​. నోట్ల రద్దు వల్ల పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరిగిందని, అసంఘటిత రంగం కుదేలైందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.బంగారం ధర భారీగా తగ్గింది...

బంగారం, వెండి ధరలు మంగళవారం భారీగా తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.679 తగ్గింది. వెండి కిలోకు రూ.1,847 తగ్గింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.రేసులో అశ్విన్​, రూట్​...

ఫిబ్రవరి నెలకుగానూ 'ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్'​ అవార్డుకు రవిచంద్రన్​ అశ్విన్​(టీమ్​ఇండియా)​, జో రూట్​(ఇంగ్లాండ్​), ​కైలీ మేయర్స్​(వెస్టిండీస్​​) నామినేట్​ అయ్యారు. మహిళా క్రికెటర్లలో టామీ బ్యూమాంట్​(ఇంగ్లాండ్​), బ్రూక్ హాలిడే(ఆస్ట్రేలియా), నాట్ సైవర్(ఇంగ్లాండ్​) రేసులో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.డైరెక్టర్​కు సైబర్​ నేరగాళ్ల టోపీ...

సైబర్​ మోసగాళ్లు సామాన్యులనే కాదు... చిత్ర దర్శకులను కూడా వదలడం లేదు. గతేడాది విడుదలైన హీరో నితిన్‌ నటించిన ‘భీష్మ’ చిత్ర దర్శకుడు వెంకట్‌ కుడుముల నుంచి సైబర్‌ దొంగలు రూ.63 వేలు కాజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.వకీల్​సాబ్​ పాట రేపే...

'వకీల్​ సాబ్'​ చిత్రంలోని 'సత్యమేవ జయతే' లిరికల్​ సాంగ్​ విడుదల తేదీ ఖరారైంది. దీంతో పాటే నాని నటిస్తున్న 'శ్యామ్‌ సింగరాయ్‌', సస్పెన్స్​ థ్రిల్లర్​ 'ఏ' చిత్ర విశేషాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details