తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@1PM - top ten news

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top ten news till now
టాప్​టెన్​ న్యూస్​@1PM

By

Published : Jun 18, 2020, 12:59 PM IST

Updated : Jun 18, 2020, 1:11 PM IST

సైనికా.. సెలవిక!

దేశ రక్షణ కోసం శత్రుమూకలతో పోరాడి వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబుకి యావత్‌ భారతావని అశ్రునయనాల అంతిమ వీడ్కోలు పలికింది. సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సైనిక లాంఛనాలతో... అమరజవాను అంత్యక్రియలు నిర్వహించారు. ఉద్విగ్నభరితంగా సాగిన అంతిమయాత్రలో బరువెక్కిన గుండెలతో దారిపొడువునా నిల్చున్న స్థానికులు... కల్నల్‌ సంతోష్‌బాబు పార్థీవదేహంపై పూలవర్షం కురిపించారు.

'దేశభక్తుడిని కన్నాను'

తల్లయ్యే అదృష్టం ఎందరికో దక్కుతుంది. నాకు మాత్రం దేశభక్తుడిని కన్న తృప్తి ఉంది. కొడుకు చనిపోయాడని బాధగా ఉన్నా.. దేశం రక్షణ కోసం ప్రాణాలు విడవడం నాకు దక్కిన ఓదార్పు’ అంటున్నారు గాల్వాన్‌ లోయలో చైనా సైనికులతో సోమవారం జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు మాతృమూర్తి బిక్కుమళ్ల మంజుల. కొడుకు గురించి ఆమె మాటల్లో..

త్యాగాల వెనుక కదిలించే గాథలు

దేశంకోసం మనం ఏం చేశాం అంటూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు సైనికులు. దొంగ దెబ్బతీసే శత్రుమూకలతో పోరాడుతూ ప్రాణాలనే అర్పిస్తున్నారు. ఇలా చైనా దుశ్చర్యలో వీరమరణం పొందిన జవాన్ల నిజ జీవితంలో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. మరి వాటి గురించి తెలుసుకుందాం!

ద్వైపాక్షిక వాణిజ్యంపై పడనుందా?

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ ప్రభావం ఇరు దేశాల వాణిజ్యంపై పడనుందా? ఈ విషయంపై వాణిజ్య నిపుణులు ఏం చెబుతున్నారు?

'ప్రధాని' నూతన పథకం

కరోనాతో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులే లక్ష్యంగా ఓ నూతన పథకానికి శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పథకాన్ని జూన్​ 20న 'గరీబ్​ కల్యాణ్​ రోజ్​గార్​ అభియాన్​' పేరిట బిహార్​లో ప్రారంభించనున్నారు. మరిన్ని వివరాలు

ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా

రాష్ట్రంలో రోజురోజుకి కరోనా విజృంభిస్తోంది. రాజకీయ ప్రముఖులు, వైద్యులు, పోలీసులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా వచ్చింది. మరింత సమాచారం...

'రూ.2 లక్షల పరిహారం'

ఏపీలోని కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వారికి రెండు లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

300 ట్రీ పార్కులకు ప్రణాళికలు

హైదరాబాద్‌ మహా నగరం చుట్టు 300 ట్రీ పార్కులను అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆహ్లాదకరంగా సేద తీరేలా నీడనిచ్చే మొక్కలు, అలంకరణ, సువాసన వెదజల్లే పూలు, ఔషధ మొక్కలను నాటుతారు. ల్యాండ్‌ స్కేప్‌ పనులు చేపడతారు. ఏమేమి సౌకర్యాలు ఉన్నాయంటే..?

'కోలుకుంటున్నా'

కరోనా నుంచి క్రమంగా కోలుకుంటున్నట్లు పాకిస్థాన్​ క్రికెటర్​ షాహిద్​ అఫ్రిదీ తెలిపాడు. ఇటీవలే వైరస్​ నిర్ధారణ అయిన ఈ ఆల్​రౌండర్​.. తాజాగా తన ఆరోగ్యం గురించి వస్తున్న అనేక వార్తలపై స్పందించాడు.

మూడో పెళ్లికి సిద్ధమైన నటి

తమిళ 'బిగ్​బాస్​ 3'తో వార్తల్లో నిలిచిన వనితా విజయ్ కుమార్​ మూడో పెళ్లికి సిద్ధమైంది. విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు పీటర్ పాల్​ను ఈనెల 27న వివాహం చేసుకోనుంది.

Last Updated : Jun 18, 2020, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details