తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @1PM - ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news till now
టాప్​టెన్​ న్యూస్ @1PM

By

Published : Jun 15, 2020, 1:01 PM IST

  • కరోనా పరీక్ష ధర ఎంతంటే...

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200గా నిర్ణయించామని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. వెంటిలేటర్​పై లేకుండా ఐసీయూలో ఉంచితే రోజుకు రూ. 7,500గా నిర్ణయించామని తెలిపారు.ఇంకేమన్నారంటే...?

  • బీఆర్కే భవన్​లో మరో కేసు

తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. జీహెచ్​ఎంసీ పరిధిలో పరిస్థితి దారుణంగా తయారైంది. సచివాలయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్​లో మరో ఉద్యోగికి కొవిడ్​ పాజిటివ్ వచ్చింది. వివరాలు ఇలా..

  • 'కేసీఆర్ వడ్డీ వ్యాపారి'

హైదరాబాద్‌ విద్యుత్ సౌధతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు భాజపా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్​ను పోలీసులు భాజపా కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. దీనిపై స్పందించిన బండి సంజయ్ ఏమన్నారంటే...

  • 'ఫోన్​ కొట్టు- ముచ్చట పెట్టు'

సాధారణంగా వైద్యులు ఏం చేస్తారు..? రోగుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని అందుకు తగ్గ వైద్యం చేస్తారు. కానీ, దిల్లీలోని ఓ ఆసుపత్రిలో మాత్రం.. కరోనా బాధితులతో ముచ్చటిస్తున్నారు. నర్సులు బాధితులకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి పలకరిస్తున్నారు. ఇంతకీ ఆ ఆసుపత్రి సిబ్బంది ఉన్నట్టుండి కరోనా రోగులతో ఎందుకిలా మాటామంతి కార్యక్రమం చేపట్టారు..?

  • అఖిలపక్షం భేటీ

దిల్లీలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయికి చేరుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమావేశమయ్యారు. దిల్లీలో కరోనా పరిస్థితి, తీసుకోవాల్సిన నిర్ణయాలపై సూచనలను కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

  • 'మళ్లీ టెస్ట్ చేయాల్సిందే'

కరోనా నిర్ధరణకు ర్యాపిడ్​ యాంటిజెన్​ పరీక్షలకు సంబంధించి కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది భారత వైద్య పరిశోధన మండలి. యాంటిజెన్​ టెస్టులో నెగిటివ్​ వస్తే ఆ శాంపిళ్లను ఆర్​టీ-పీసీఆర్​ ద్వారా పరీక్షించాలని సిఫార్సు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి నిబంధనలను వెల్లడించింది.

  • ' మేం మంచే కోరుకుంటాం.. కానీ!'

చైనాతో క్రియాశీలక సంబంధాలను పెంచుకోవాలనే అమెరికా కోరుకుంటోందని.. అయితే చైనా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ వాగ్దానాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. ఇంకేమన్నారంటే...

  • 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్​

స్టాక్​మార్కెట్లు భారీ నష్టాల దిశగా సాగుతున్నాయి. కరోనా సెకండ్​ వేవ్​ భయాలతో ఆసియా మార్కెట్లలో బలహీన సంకేతాలే నష్టాలకు కారణం. బ్యాంకింగ్​, లోహ రంగాల షేర్లు భారీ ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడ్స్ ఎలా ఉన్నాయంటే..?

'టీమ్​ ఇండియాకు భయం పోయింది'

టీమ్​ ఇండియా బౌలర్లపై ప్రశంసలు కురిపించిన మాజీ పేసర్ షాన్ పొలాక్.. అదనపు బౌలర్​ కోసం ఇబ్బందిపడే రోజులు భారత జట్టుకు పోయాయని వెల్లడించాడు.

ఆ నటి బాడీగార్డ్​ జీతం ఎంతంటే?

తన బాడీగార్డ్​ను సోదరుడిలా చూస్తున్న హీరోయిన్ దీపికా పదుకొణె.. అతడికి ఏడాది కళ్లు చెదిరే జీతం ఇస్తోందట.​ ఆ మొత్తం గురించి తెలుసుకున్న నెటిజన్లు.. ఆశ్చర్యానికి గురవుతున్నారు. జీతం ఎంత?

ABOUT THE AUTHOR

...view details