'ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగు'
కొవిడ్‌పై ఏర్పాటైన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ మొదటిసారి సమావేశమైంది. పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి అధ్యక్షతన సచివాలయంలో భేటీ అయిన టాస్క్‌ఫోర్స్ కమిటీ... రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితులతో పాటు, వైరస్‌ను ఎదుర్కొనేందుకు చేపడుతున్న చర్యలపై సుదీర్ఘంగా చర్చించింది. కొవిడ్ చికిత్సకు అవసరమయ్యే ఔషధాలు, వైద్యసామగ్రి, నిల్వలు, అవసరాలపై టాస్క్‌ఫోర్స్ సమీక్షించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తగ్గుముఖం పడుతోంది
తెలంగాణకు టీకా, ఆక్సిజన్ కోటా పెంచాలని కేంద్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ ఆదేశాలతో హరీశ్ రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటింటి ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రాష్ట్రంలో 4723 కొత్త కేసులు.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల్లో 69 వేల 525 మందికి పరీక్షలు చేయగా... 4723 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మహమ్మారి బారిన పడి 31 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పటిష్ఠంగా అమలు
క్షేత్ర స్థాయిలో లాక్డౌన్ పటిష్ఠంగా అమలయ్యేలా పోలీసులు పనిచేస్తున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. లాక్డౌన్ అమలుపై ఇప్పటికే సీపీలు, జిల్లా ఎస్పీలకు దిశానిర్దేశం చేసినట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఏటీఎం కేసు ఛేదించారు.
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఏటీఎం వద్ద ఏప్రిల్ 29న జరిగిన నగదు దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. దుండగులు జరిపిన కాల్పుల్లో.. ఏటీఎం సెక్యూరిటీ గార్డు మృతి చెందగా… మరొకరు గాయపడ్డారు. చోరీకి పాల్పడినవారు బిహార్‌కు చెందిన అజిత్‌కుమార్, ముఖేశ్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.