తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 9PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news till 9 pm
టాప్​టెన్​ న్యూస్​ @ 9PM

By

Published : May 11, 2021, 8:59 PM IST

రేపట్నుంచి లాక్‌డౌన్‌

కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా రాష్ట్రంలో రేపట్నుంచి లాక్​డౌన్ అమలు కానుంది. పది రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం పది గంటల నుంచి లాక్​డౌన్ ఉండనుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్​లో కేబినెట్ సమావేశమైంది. కరోనా నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నిబంధనలు​ ఇవే..!

రాష్ట్రంలో రేపు ఉదయం 10 గంటల నుంచి లాక్​డౌన్​ అమలుకానుంది. మే 12 నుంచి 22 వరకు పదిరోజులు కొనసాగనున్న లాక్​డౌన్​కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనల్లో ప్రధానంగా.. రైతులకు, ప్రజా జీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సర్కారు పలు మినహాయింపులు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వారంతా పాస్​ .!

పదోతరగతి విద్యార్థులందరినీ పాస్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎఫ్‌ఏ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ఉత్వర్వుల్లో పేర్కొంది. కొవిడ్‌ కారణంగా పదో ‌తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మరో 4,801 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో తాజాగా మరో 4801 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 32 మంది మరణించగా.. 7403 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వరుసగా రెండో రోజూ .!

దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. 18,50,110 నమూనాలను పరీక్షించగా.. 3.29 లక్షల మందికి పాజిటివ్​గా తేలింది. మరో 3,876మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'కరోనా సెకండ్​ వేవ్​ తగ్గుముఖం!'

దేశంలో కరోనా కొత్త కేసులు, మరణాల్లో తగ్గుదల నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా సెకండ్​ వేవ్​ తగ్గుముఖం పడుతుందనేందుకు ఇది సంకేతమని అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పాఠశాలలో కాల్పులు

రష్యాలోని కజన్​ ప్రాంతంలో ఓ పాఠశాలలో మంగళవారం జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కాల్పుల్లో మొత్తం 8 మంది చనిపోయారు. 18 మంది విద్యార్థులు సహా 21 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నా కన్నీళ్లు తుడిచాడు

కెరీర్​, జీవితంలో ప్రతిదశలో సారథి కోహ్లీ తనకు మద్దతిచ్చాడని అన్నాడు పేసర్​ మహ్మద్​ సిరాజ్​. ఆస్ట్రేలియా పర్యటనలో తన తండ్రి చనిపోయినప్పుడు విరాట్​ తనను ఓదార్చిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పసిడి కాస్త తగ్గింది.

పసిడి ధర కాస్త తగ్గింది. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర మంగళవారం రూ.200పైగా దిగొచ్చింది. వెండి ధర కిలో ఏకంగా రూ.71 వేల మార్క్ దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'15 కోట్లు సాయం చేశా'

కరోనా కష్ట సమయంలో తాను ఇప్పటివరకు రూ.15 కోట్లు సాయం చేసినట్లు తెలిపారు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్. తన సేవల్ని ఇంకా కొనసాగిస్తానని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details