1. ముగిసిన సీఎం సమీక్ష
రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. కొవిడ్ వ్యాప్తి చేసే అవకాశమున్నవారికి ముందుగా టీకా.. కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ విషయంలో రాష్ట్రాలకు వెసులుబాటు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్ సహా... వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, ఔషధాలు, వ్యాక్సినేషన్‌పై సమావేశంలో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ముగ్గురు మృతి
హైదరాబాద్ కింగ్‌కోఠి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు కరోనా బాధితులు మృతి చెందారు. ఆక్సిజన్ అందక 20మంది సుమారు గంటసేపు ఇబ్బంది ఎదుర్కొన్నారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రిలోని ఆక్సిజన్ ఫిల్లింగ్ ట్యాంక్‌లో ఆక్సిజన్ అయిపోవడంతో.. మరో ట్యాంక్ రావటానికి ఆలస్యం కావడం వల్ల సమస్య తలెత్తింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఐదువేల లోపే..
రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య సైతం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో కొత్త కేసుల కంటే.. వైరస్‌ను జయించిన వారి సంఖ్య సంఖ్య అధికంగా ఉందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా 5 వేలకు దిగువకు కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. నాలుగో రోజూ అదేస్థాయి.!
దేశంలో కొవిడ్ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజూ 4లక్షలకుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. వైరస్ సోకినవారిలో మరో 4,092 మంది చనిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సీఎంలకు మోదీ ఫోన్
పంజాబ్, కర్ణాటక, బిహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులపై ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈమేరకు ఫోన్లో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.