తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @3PM - టాప్​టెన్​ న్యూస్​ @3PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు...

top ten news in Telugu
top ten news in Telugu

By

Published : Dec 24, 2020, 2:56 PM IST

1.అత్యవసర సమావేశం...

కొత్త రకం కరోనా స్ట్రైయిన్​పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బీఆర్కే​ భవన్​లో మధ్యాహ్నం మూడు గంటలకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ​నిపుణుల కమిటీతో అత్యవసర సమావేశం కానున్నారు. రెండో దశను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.నివేదిక ఇవ్వాలి...

అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై హైకోర్టు విచారణ జరిపింది. 2016లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ దాఖలు చేసింది. కౌంటర్ దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వం మరో వారం రోజులు గడువు కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.మరో నలుగురు అరెస్ట్​...

దా'రుణ' యాప్‌ల నిర్వాహకుల వేధింపుల కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌లకు సంబంధించి మరో నలుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన వారి కార్యాలయంలో ల్యాప్​టాప్​లు, హార్డ్ డిస్క్​లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.రోడ్డున పడేశారు...

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చట్టబద్దంగానే నిరసనలు తెలుపుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వం వెంటనే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి చట్టాలని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ రైతుల కోసం కాకుండా కార్పొరేట్ల కోసం పని చేస్తున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.రైతులకు మద్దతుగా హజారే...

నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపడుతున్న రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టనున్నట్టు సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రకటించారు. త్వరలోనే దిల్లీలోని రామ్​లీలా మైదానంలో రైతు దీక్షల్లో పాల్గొంటానని తెలిపారు. 'ఈటీవీ-భారత్​'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.సుప్రీంకు కేరళ సర్కార్​...

శబరిమల ఆలయానికి అనుమతించే భక్తుల విషయంపై కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ విజయన్​ సర్కార్​ సుప్రీంను ఆశ్రయించింది. ఉన్నత స్థాయి కమిటీ సూచించిన మార్గదర్శకాలను కోర్డు పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్​లో పేర్కొంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.వారి కోసం గాలింపు...

బ్రిటన్​, అరబ్ దేశాల నుంచి వచ్చిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు గోవా వైద్యాధికారులు. కొత్త రకం కరోనా విస్తరిస్తోన్ననేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణ గోవాలోని కొన్ని ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.ఆ ప్రధానిపై 900 కోట్ల దావా...

ఇటలీ ప్రధానిపై ఆ దేశంలోని కొవిడ్-19తో మృతి చెందిన వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన నష్టానికి రూ.900 కోట్ల పరిహారం చెల్లించాలని అంటున్నారు. వైరస్​ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఇటలీ విఫలమైన నేపథ్యంలో బెర్గామో ప్రజలు న్యాయపోరాటం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.ఆ పాటకు వకీల్​సాబ్​ ఫిదా...

వకీల్‌సాబ్‌ షూటింగ్‌ విరామంలో అరకు ఆదివాసీలు పాడిన పాటను ఆస్వాదించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ పాట వింటుంటే బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ రచించిన వనవాసి గుర్తుకు వస్తోందని ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.అతన్ని మిడిలార్డర్​లో పంపిస్తే...

అడిలైడ్​ టెస్టులో పేలవ ప్రదర్శన చేసిన పృథ్వీషాకు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్​ హగ్ మద్దతుగా నిలిచాడు. అతడిని మిడిల్​ ఆర్డర్​లో ఆడించాలని సూచించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details