ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుఆర్ వాల్యూ పైపైకి.. కరోనా కేసుల వ్యాప్తిలో కీలకమైన రీప్రొడెక్టివ్ వాల్యూ(ఆర్ వాల్యూ) మెట్రో నగరాలను వణికిస్తోంది. వైరస్ సోకిన వ్యక్తి తిరిగి ఎంత మందికి వ్యాప్తి చేస్తారనేది ఆర్ వాల్యూగా లెక్కిస్తారు. ఉదాహరణకు ఇది ఒకటి ఉంటే... 'సర్కారును మేల్కొల్పేందుకే జాగరణ దీక్ష'ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంఘీభావంగా నేడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘జాగరణ’ దీక్ష చేయనున్నారు. 317 జీవోను సవరించేదాకా ఉద్యోగుల పక్షాన ఉద్యమించాలని భాజపా నిర్ణయించింది.కాంగ్రెస్‌లో భగ్గుమన్న అంతర్గత కలహాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు గ్రూపు రాజకీయాలు ఎక్కువవుతున్నాయి. అంతర్గతంగా ఉన్న విభేదాలు హిర్గతం అవుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పీసీసీ కార్యవర్గ అధ్యక్షుడు జగ్గారెడ్డిల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలో రైతు రచ్చబండ కార్యక్రమంతో తెరపైకి వచ్చిన విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.నూతన సంవత్సర వేడుకల్లో విషాదం..నూతన సంవత్సరం వేడుకలు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈతకు వెళ్లిన ఇద్దరు మిత్రులు తల్లిదండ్రులకు కన్నీటిని మిగిల్చి వెళ్లిపోయారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో జరిగింది.పెళ్లైన వారం రోజులకే ఎస్సై మృతి వివాహమైన వారం రోజులకే వికారాబాద్ వన్‌టౌన్ ఎస్‌ఐ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఈఘటనలో ఎస్సైతో పాటు ఆయన తండ్రి కూడా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.ట్రై సర్వీస్ విచారణ పూర్తితమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై ట్రై సర్వీస్ విచారణ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను వచ్చే వారం వైమానికదళ ప్రధాన కార్యాలయానికి సమర్పించనున్నట్లు సమాచారం.మేకల్ని దొంగిలించిన పోలీస్కొత్త సంవత్సర వేడుకల కోసం ఓ పోలీసు అధికారి.. మేకలను దొంగతనం చేశాడు. వాటిని వధించి తన సహచరులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. చివరకు అధికారుల ఆగ్రహానికి గురై.. సస్పెండ్ అయ్యాడు.నిమిషానికి 9000 ఫుడ్ ఆర్డర్లున్యూఇయర్ వేళ ఫుడ్ డెలివరీ యాప్‌ల పంట పండింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో స్విగ్గీ యాప్‌కు ఏకంగా నిమిషానికి 9వేల డెలివరీలు వచ్చాయట. జొమాటోలోనూ నిమిషానికి 8వేల మందికి పైగా ఆహారం ఆర్డర్ చేసుకున్నట్లు ఆయా యాప్‌లు వెల్లడించాయి.అంతరిక్షంలో న్యూఇయర్అంతరిక్షంలో నూతన సంవత్సర వేడుకలు సరికొత్త రికార్డును సృష్టించాయి. రెండు స్పేస్ సెంటర్లలో విధుల్లో ఉన్న పది మంది వ్యోమగాములు.. న్యూ ఇయర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. స్పేస్‌లో ఒకేసారి ఇంతమంది ఈ వేడుకల్లో పాల్గొనడం మానవ అంతరిక్ష చరిత్రలోనే ఇదే తొలిసారి.బాలయ్యతో భళ్లాలదేవ..నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోకు అతిథిగా వచ్చారు 'భళ్లాలదేవ' రానా దగ్గుబాటి. బాలయ్యతో రానా చేసిన సందడి ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.