1. ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ ఆలస్యం
ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన బెయిల్‌పై విడుదలయ్యే ప్రక్రియలో ఆలస్యం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మహిళ సజీవదహనం
హైదరాబాద్ వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో మంటలు చెలరేగి భార్య సజీవదహనమవగా... భర్తకు గాయాలయ్యాయి. ఉదయం 8 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ప్రభుత్వంపై బండి ఫైర్
సీఎం కేసీఆర్ తీరుతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రైతుల పంటలను కొనుగోలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో రైతు గోస-భాజపా పోరు దీక్షలో ఆయన మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. బ్లాక్ ఫంగస్‌తో ఇద్దరు మృతి
జగిత్యాల జిల్లా బ్లాక్ ఫంగస్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో పది మంది బ్లాక్ ఫంగస్ బాధితులు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 10 తర్వాత స్తబ్ధత
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పదమూడో రోజు కఠినంగా అమలు చేస్తున్నారు. మొదట్లో చూసీచూడనట్లు ఉండగా.. జనాలు ఎక్కువగా రోడ్లపైకి వచ్చారు. మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం రాకుండా ప్రస్తుత లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల తర్వాత... పోలీసులు ఆంక్షలు పక్కాగా అమలయ్యేలా చూస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. తీవ్ర తుపానుగా యాస్
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. 'యాస్' తుపానుగా రూపాంతరం చెందిందని ఐఎండీ తెలిపింది. రానున్న 24 గంటల్లో క్రమంగా తీవ్ర తుపానుగా మారుతుందని చెప్పింది. మరోవైపు.. తుపాను సన్నద్ధతపై ప్రభావిత ప్రాంతాల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు సమీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. సుప్రీం అసంతృప్తి
వలస కార్మికుల సమస్యల సుమోటో కేసుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. రాష్ట్రాల్లోని వలస కార్మికులు ఆత్మనిర్భర్ భారత్ ప్రయోజనాలు పొందుతున్నారో లేదో వివరించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర వివరాలతో అఫిడవిట్ ధాఖలు చేయాలని స్పష్టం చేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. అక్కడి నుంచే కరోనా వ్యాప్తి!
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే ఆవిర్భవించిందనే అనుమానాలకు బలం చేకూరేలా మరో వార్త బయటకు వచ్చింది. కొవిడ్ మహమ్మారి బాహ్య ప్రపంచంలో వ్యాపించడానికి ముందే ల్యాబ్‌లోని చాలా మంది పరిశోధకులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అమెరికా ఇంటెలిజెన్స్‌కు ఈ సమాచారం వచ్చిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం రాసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. 'బంగార్రాజు'లో పాయల్ ఐటమ్ సాంగ్.!
అక్కినేని హీరో నాగార్జున ప్రధానపాత్రలో 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రానికి ప్రీక్వెల్‌గా 'బంగార్రాజు' తెరకెక్కబోతోంది. ఇందులో ఓ ఐటమ్ సాంగ్‌లో నటి పాయల్ రాజ్‌పుత్ కనిపించనుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై స్పందించింది పాయల్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఆమిర్ అవసరం
ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం పాక్ జట్టులోకి మహ్మద్ ఆమిర్‌ను తీసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డాడు ఆ దేశ మాజీ పేసర్ వసీం అక్రమ్. ఆమిర్ అనుభవం యువ బౌలర్లకు తోడ్పడుతుందని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఇదీ చదవండి:భాగ్యనగరంలో కఠినంగా లాక్‌డౌన్.. నిర్మానుష్యంగా రహదారులు