తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news, telangana news
టాప్ న్యూస్, తెలంగాణ వార్తలు

By

Published : May 17, 2021, 1:00 PM IST

  • ఆదేశించినా పట్టించుకోరా?: హైకోర్టు

రాష్ట్రంలో లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్ పోలీసుల పనితీరును మాత్రం ప్రశంసించింది. కరోనా పరిస్థితులపై ధర్మాసనం విచారణ జరిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన

తెలంగాణలో లాక్​డౌన్ ఆంక్షలు ఆరో రోజు పటిష్ఠంగా అమలవుతున్నాయి. ఉదయం వేళ నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు వచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెలంగాణ నంబర్ వన్

సంవత్సరం కాలంగా కరోనా నియంత్రణలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెర్స్, ఇండిపెండెంట్ పబ్లిక్ పాలసీ రీసెర్చర్ సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'స్పుత్నిక్ వి' టీకాల పంపిణీ

అపోలో ఆసుపత్రుల్లో 'స్పుత్నిక్ వి' టీకాల పంపిణీ కార్యక్రమాన్ని అపోలో గ్రూప్ ప్రెసిడెంట్ డాక్టర్‌ హరిప్రసాద్, డాక్టర్‌ రెడ్డీస్ సీఈవో ఎంవీ రమణ ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఈటల భూవ్యవహారంలో మరోసారి..

ఈటల రాజేందర్ భూవ్యవహారంలో మరోసారి తనిఖీలు చేపట్టారు. మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల పరిశీలిస్తున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • టీఎంసీ నేతలు అరెస్టు

'నారదా స్టింగ్' కేసులో టీఎంసీ ఎమ్మెల్యేలు అయిన ఫిర్హాద్​ హకీం, సుబ్రతా ముఖర్జీ, మదన్​ మిత్రా సహా మాజీ టీఎంసీ నేత సోవన్​ ఛటర్జీను కేంద్ర దర్యాప్తు సంస్థ ( సీబీఐ) సోమవారం అరెస్టు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పెను తుపానుగా 'తౌక్టే'

తీర ప్రాంత రాష్ట్రాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న 'తౌక్టే' తుపాను మరింత విజృంభించి పెను తుపానుగా మారింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆరు గంటల మధ్య ఇది గుజరాత్​ను తాకనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆసుపత్రి అవసరం 0.06%!

కొవిడ్​ వ్యాక్సిన్​ వేయించుకున్న వారిలో వైరస్​ సోకే అవకాశం చాలా తక్కువని అపోలో ఇంధ్రప్రస్థ ఆసుపత్రి అధ్యయనం వెల్లడించింది. ఒకవేళ వైరస్​ బారిన పడినా.. 0.006 శాతం మందే ఆసుపత్రిలో చేరే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కోహ్లీ స్లామ్ బుక్ వైరల్

టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ స్లామ్ బుక్ నెట్టింట వైరల్​గా మారింది. ఇందులో తనకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నాడు విరాట్.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • హాకీ ప్లేయర్​గా మెగాహీరో​?

యువహీరో వైష్ణవ్​తేజ్​ తన కొత్త సినిమాలో హాకీ ప్లేయర్​గా కనిపించనున్నాడని తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్​ బ్యానర్​లో రూపొందబోయే ఈ సినిమాతో పృథ్వీ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details