తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 1PM - తెలంగాణ టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana today till now
తెలంగాణ టుడే టాప్ న్యూస్

By

Published : Feb 14, 2021, 12:58 PM IST

  • కేసీఆర్​కు బర్త్​ డే గిఫ్ట్?

ఈ నెల 17 సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఒకే రోజు కోటి మొక్కలు నాటి ముఖ్యమంత్రికి బహుమతిగా ఇవ్వనున్నట్లు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. కేటీఆర్​ ఇచ్చిన పిలుపుతో ఇప్పటికే పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • హైదరాబాద్​కు అరకు ఘటన మృతదేహాలు

అరకు లోయ ప్రమాద ఘటన మృతదేహాలను హైదరాబాద్​కు తరలించారు. షేక్‌పేటలోని బాధితుల ఇంటికి నాలుగు మృతదేహాలు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో నగరానికి చెందిన సత్యనారాయణ, శ్రీనిత్య, సరిత, లత మరణించారు. మృతదేహాలకు కాసేపట్లో షేక్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఎమ్మెల్సీ బరిలో రమణ

రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికలకు తెదేపా తమ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ - మహబూబ్‌నగర్ - రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెదేపా అభ్యర్ధిగా... రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ బరిలో దిగగా... నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు మువ్వా అరుణ్ కుమార్ పేరును పార్టీ ఖరారు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తేమ పెరుగుతోంది!

తెలంగాణలో చలి తీవ్రత తగ్గింది. చలి తగ్గినా... గాలిలో తేమ కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా సాధారణం కన్నా 21 శాతం అధికంగా తేమ ఉంది. తెల్లవారుజామున పొగమంచు కురుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చెన్నైలో మోదీ

తమిళనాడు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అర్జున్ యుద్ధ ట్యాంకును భారత సైన్యాధిపతికి అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తీయని విరాళం

గుజరాత్​కు చెందిన ఓ బేకరీ.. 48 అడుగుల పొడవైన 'రామసేతు కేక్​'ను తయారు చేసింది. రూ. 1,11,111 ను అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • దటీజ్​ 'ట్రంపిజం'!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై డెమొక్రాట్లు ప్రయోగించిన అభిశంసన అస్త్రం సెనేట్​లో వీగిపోయింది. ట్రంప్​కు వ్యతిరేకంగా కేవలం ఏడుగురు రిపబ్లికన్లు ఓట్లు వేయగా.. మిగిలిన వారు ఆయన్ను గట్టెక్కించారు. దీనితో పార్టీపై ట్రంప్​ ఇంకా ఆధిపత్యం చెలాయిస్తున్నట్టు.. ఆయన తిరుగు లేని శక్తిగా ఉన్నట్టు అర్థమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భయంతోనే ఓటు

అభిశంసన ఓటింగ్​లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు మద్దతుగా నిలిచిన రిపబ్లికన్లపై విమర్శలు గుప్పించారు డెమొక్రటిక్​ నేతలు. వారి ఓటు దేశ చరిత్రలో మాయని మచ్చగా నిలచిపోతుందన్నారు. పదవులను కాపాడుకునేందుకు, పిరికితనంతో ఓటు వేశారని ఆరోపించారు హౌస్​ స్పీకర్​ నాన్సీ పెలోసీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఇవి రోహిత్​ 'వాలెంటైన్స్'​ శతకాలు

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో సెంచరీతో ఆకట్టుకున్నాడు రోహిత్. గతంలోనూ తన భార్య రితిక సజ్​దేహ్​ సమక్షంలో పలు శతకాలు సాధించాడు హిట్​మ్యాన్​. వాలెంటైన్స్​ డై సందర్భంగా గతంలో ఓ సారి మూడెంకల స్కోరును అందుకున్న ఈ ఓపెనర్​.. తాజాగా దానికంటే ఒక్కరోజు ముందు సెంచరీని సాధించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నేను చనిపోయానని అనుకున్నారు

తన కెరీర్​లోని ఎత్తు పల్లాల గురించి చెప్పిన నటుడు, దర్శకుడు సముద్రఖని.. జీవితంలో ఎదురైన మంచి, చెడు అనుభవాల్ని పంచుకున్నారు. వీటితో పాటు బోలెడు సంగతుల్ని పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details