- రైతు దీక్ష: నడిరోడ్డే వేదిక.. వెనకడుగే లేదిక
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల ఉపసంహరణే ధ్యేయంగా చెక్కుచెదరని సంకల్పంతో రైతుల ఉద్యమం కొనసాగుతోంది. కొన్ని నెలలపాటు రోడ్లపైనే బైఠాయించడానికి సిద్ధమై వచ్చిన రైతులు తమ భోజన వసతి వరకు సొంత ఏర్పాట్లు చేసుకున్నారు. వారు బస చేసినచోట ఉన్న ప్రజలు మానవత్వంతో తమవంతుగా సాయం చేస్తున్నారు. స్థానికులకూ ఆత్మీయత పంచుతున్నారు రైతులు. దిల్లీ-టిక్రీ సరిహద్దును చూస్తే అదే ఒక గ్రామమా అన్నట్లు కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- '1975 ఎమర్జెన్సీ'పై సుప్రీంలో 94 ఏళ్ల వృద్ధురాలి పిటిషన్
1975లో 'రాజ్యాంగ విరుద్ధంగా' ఎమర్జెన్సీ విధించారని సుప్రీంకోర్టులో ఓ 94 ఏళ్ల వృద్ధురాలు పిటిషన్ దాఖలు చేశారు. దానివల్ల తమ కుటుంబంలోని మూడు తరాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు. పరిహారంగా రూ.25 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై డిసెంబర్ 7న విచారణ చేపట్టనుంది అత్యున్నత న్యాయస్థానం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 'మూడేళ్లలో 10 లక్షల మందికి ఆన్‌లైన్‌లో పరీక్షలు'
ప్రపంచం ఇప్పుడు ఆన్లైన్వైపు చూస్తోంది. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు నడుస్తున్నాయ్. పరీక్షలు కూడా ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు సిద్ధమంటున్నారు హైర్మీ వ్యవస్థాపకుడు చాకో వల్లియప్ప. ఇప్పటికే.. 25 విద్యాసంస్థలు, 100 కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. ఈనాడుతో ముఖాముఖిలో కీలక విషయాలు పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఫిబ్రవరి 10 వరకు ఆగాల్సిందే..
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వింత పరిస్థితిని సృష్టించాయి. డిసెంబరు 4న కార్పొరేటర్లుగా గెలిచినప్పటికీ ఆ హోదాలో చలామణి అవలేని పరిస్థితి. ప్రస్తుతమున్న పాలకమండలి గడువు 2021 ఫిబ్రవరి 11వరకు ఉండటంతో.. గెలిచిన వారు అప్పటి వరకు ప్రమాణ స్వీకారం కోసం వేచి చూడాల్సిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- నేతల్లో కరోనా కలవరం
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పలువురు నేతల్లో కొవిడ్ లక్షణాలు బయట పడుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులకు కరోనా నిర్ధారణ కావడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కొత్త కార్పొరేటర్లతో నేడు కేటీఆర్ భేటీ