తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 9PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 9PM
టాప్​టెన్​ న్యూస్​ @ 9PM

By

Published : Jul 14, 2021, 9:00 PM IST

కేబినెట్ ఆమోదం

తెలంగాణ స్టేట్​ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్దఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో తొలిదశలో కనీసం 10 ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు చేయాలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వ్యవసాయంపై ఉపసంఘం

రాష్ట్రంలో ధాన్యం నిల్వ సామర్థ్యం పెంచుకోవాలని సీఎం కేసీఆర్​ సూచించారు. వచ్చే ఏడాది ధాన్యం ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతే ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ ప్రస్థానం, సాధించిన ప్రగతిపై బుధవారం జరిగిన కేబినెట్​ సమావేశంలో సీఎం కేసీఆర్​ ప్రస్తావించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

విజయశాంతికి చుక్కెదురు!

హైకోర్టులో భాజపా నేత విజయశాంతికి చుక్కెదురైంది. కోకాపేట, ఖానామెట్​లోని ప్రభుత్వ భూముల వేలాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ పిటిషన్​ను కోర్టు కొట్టివేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆగస్టులోనే పరీక్షలు!

ప్రభుత్వం అనుమతి ఇస్తే ఆగస్టు మొదటి వారంలో పరీక్షలను(Inter‌ first year exams) ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇంటర్‌బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆగస్టులో ఇంటర్‌ తొలి ఏడాది పరీక్షలు ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్​డౌన్​

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదవుతోంది. అయితే ఆ ఒక్క రాష్ట్రంలో మాత్రం విపరీతంగా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఒక్కరోజే మరో 15,600 మంది వైరస్ బారిన పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వారికి డీఏ పెంపు.!

ఉద్యోగులకు డియర్​నెస్ అలవెన్స్​ (డీఏ), పెన్షనర్లకు డియర్​నెస్​ రిలీఫ్​ (డీఆర్​) పెంపు, ఆయుష్​ మిషన్​ పొడగింపు వంటి కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అప్పుడే కరోనాపై విజయం!'

వయోజనులందరికీ డిసెంబర్​ నాటికి టీకా వేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియలో ప్రస్తుతం అనుసరిస్తున్న వేగమే ఇకపైనా కొనసాగితే.. ఆ లక్ష్యం చేరుకోవడం అసాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'గల్వాన్​ ఘర్షణ!'

తూర్పు లద్దాఖ్​లో చైనా సైన్యం మరోసారి దుస్సాహసానికి పాల్పడిందా? గల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ(India China soldiers clash) జరిగిందా? కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ షేర్ చేసిన కథనంలో ఏముంది? దీనిపై ఇండియన్ ఆర్మీ ఏమంటోంది? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఒలింపిక్స్ జరిగేనా?

ఒలింపిక్స్(Tokyo Olympics) ఆతిథ్య నగరం​ టోక్యోలో కరోనా కేసులు ఆరు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. దీంతో సమావేశమైన జపాన్​ ప్రధాన మంత్రి యోషిహిదే సుగ, అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ అధ్యక్షుడు థామస్​ బాచ్​.. విశ్వక్రీడలు సురక్షితంగా జరుగుతాయని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కరీనా​పై కేసు

ప్రముఖ కథానాయిక కరీనా కపూర్​పై పోలీస్ కేసు నమోదైంది. ఆమె రాసిన పుస్తకం టైటిల్​ తమ మనోభావాల్ని కించపరిచేలా ఉందని ఫిర్యాదు చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details