'మార్గదర్శకాలు సిద్ధం చేయండి '
పిల్లల ఆరోగ్యం, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల ప్రారంభంపై వారం రోజుల్లో మార్గదర్శకాలు రూపొందించాలని విద్యా శాఖను హైకోర్టు ఆదేశించింది. ప్రత్యక్ష బోధనకు హాజరు తప్పనిసరి కాదని.. ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయని విద్యా శాఖ వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ఇంతకు మించొద్దు'
కొవిడ్ చికిత్సల కోసం ప్రభుత్వం(government) ఖరారు చేసిన గరిష్ఠ ధరలను(rates) అమలు చేయని ప్రైవేట్ ఆస్పత్రులపై భారీ జరిమానాలు(fines) విధించాలని హైకోర్టు(HC) పేర్కొంది. కరోనాతో (Corona) తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను చేరదీసి వారి అవసరాలు తీర్చాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మార్గదర్శకాలివే..!
తెలంగాణలో ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలకు (Inter second year results) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం(TS government) మార్గదర్శకాలు(guidelines) ఖరారు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరో ఐదు నెలలు
దీపావళి వరకు ఉచిత రేషన్ పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 80 కోట్ల మందికి మరో ఐదు నెలల పాటు ఉచితంగా రేషన్ అందనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వారికి శుభాకాంక్షలు
అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI), భారత క్రీడాకారులకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. మన దేశం తరఫున ఇప్పటివరకు పోటీల్లో పాల్గొన్న వారికి, మరికొన్ని రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ బరిలో దిగనున్న క్రీడాకారులకు విషెస్ చెప్పారు. ఇంతకీ ఈ ఒలింపిక్ డే ఎప్పుడు మొదలైంది? దీని చరిత్రేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.