తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @9AM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-news-at-9am
టాప్​టెన్​ న్యూస్ @9AM

By

Published : Mar 23, 2021, 8:58 AM IST

  • 10 మంది దుర్మరణం..

మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఉద్యోగాల భర్తీపై ప్రకటన!

తెలంగాణలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంపై శాసనసభలో ప్రకటన చేయనున్నారు. ముందుగా పోలీసు తదితర నియామక సంస్థల ద్వారా ఖాళీల భర్తీ ప్రకటించే వీలుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఉప పోరుకు రంగం సిద్ధం..

నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక కోసం రంగం సిద్ధమైంది. మంగళవారం నోటిఫికేషన్ వెలువడటంతోపాటు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు నిడమనూరు తహసీల్దార్ కార్యాలయాన్ని సిద్ధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ముగ్గురు మృతి..

రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ వద్ద రోడ్డుప్రమాదం సంభవించింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ట్రాలీని ఢీకొన్న వ్యాను.. ఐదుగురు మృతి..

ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటన ఏపీలోని నెళ్లూరు జిల్లాలో జరిగింది. సంగం మండలం దువ్వూరు వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాలీని.. పాలవ్యాను ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కాల్పుల్లో 10 మంది మృతి..

అమెరికాలోని ఓ స్టోర్​లోకి చొరబడి ఓ సాయుధుడు చేసిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి సహా 10 మంది మరణించారు. కొలరాడోలోని బౌల్డర్ నగరంలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సీఎంగా కొనసాగే అర్హత లేదు..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ఠాక్రేకు మరొక్క క్షణం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్​. ముఖేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో నిలిపి ఉంచిన కారు కేసులో పోలీసు అధికారుల ప్రమేయంపై మాట్లాడిన ఆయన.. నైతిక బాధ్యతగా సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నేడు భారత్​-పాక్​ భేటీ..

పాక్​కు చెందిన జల నిపుణుల బృందం సోమవారం భారత్​కు చేరుకుంది. మంగళ, బుధవారాల్లో.. దిల్లీలో జరిగే వార్షిక సింధు నదీ సమావేశంలో ఈ బృందం పాల్గొననుంది. సింధు నదీ జలాలపై ఇరు దేశాలు చర్చించుకోనున్నట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మా లక్ష్యం ప్రపంచకప్..

టీమ్ఇండియాతో వన్డే సిరీస్​లో సత్తాచాటితే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవచ్చని యువ ఆటగాళ్లకు సూచించాడు ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్. టీ20, 50 ఓవర్ల ఫార్మాట్​లో పరిస్థితులు దాదాపు ఒకే రకంగా ఉంటాయని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'మణికర్ణిక'.. ఫైర్​బ్రాండ్!​

టీనేజ్​లోనే నటిగా ఎంట్రీ ఇచ్చి, బాలీవుడ్​లో ప్రస్తుతం స్టార్​ హోదాలో ఉంది నటి కంగనా రనౌత్. మంగళవారం (మార్చి 23) ఆమె పుట్టినరోజు సందర్భంగా కంగన జీవిత విశేషాలపై ప్రత్యేక కథనం.

ABOUT THE AUTHOR

...view details