- కొవిడ్ అంతం కావాలి..
హైదరాబాద్ రాజ్భవన్లో జరిగిన... ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో తమిళిసై దంపతులు పాల్గొన్నారు. గవర్నర్ దంపతులను పురోహితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. తెలంగాణ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలందరికీ గవర్నర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్ కార్యక్రమాన్ని తమిళిసై ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎం సభ ఆపాలంటూ హౌస్ మోషన్..
కరోనా విజృంభిస్తున్న వేళ నాగార్జునసాగర్ అనుములలో సీఎం కేసీఆర్ తలపెట్టిన సభను ఆపాలంటూ కొందరు రైతులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సాయమందించిన ఎమ్మెల్సీ కవిత..
ఎమ్మెల్సీ కవిత మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. వివిధ కారణాలతో దివ్యాంగులుగా మారిన పలువురికి మూడు చక్రాల స్కూటీలను అందించి వారికి చేయూతనిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉత్తమ్ కుమార్ ఫిర్యాదు..
కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా లక్షమందితో సీఎం కేసీఆర్ హాలియాలో సమావేశం నిర్వహిస్తున్నారని సీఈసీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఈసీకి ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్తో జరిగిన దృశ్యమాధ్యమ సమీక్షలో సూర్యాపేట జిల్లా కోదడ నుంచి ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తిట్ల సంస్కారం తీసుకొచ్చిందే కేసీఆర్..
సీఎంను తిడితే కేసులు పెడతామని హెచ్చరిస్తోన్న మంత్రి కేటీఆర్.. అసలు తిట్ల సంస్కారం తీసుకొచ్చిందే కేసీఆర్ అన్న విషయం మరచిపోతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గుర్తు చేశారు. మరోవైపు తెరాస వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్కు దక్కనివ్వకుండా.. భాజపా, అధికార పార్టీతో కలిసి నాటకం ఆడుతోందని భట్టి దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాధ్యతలు స్వీకరించిన సుశీల్..