తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 5PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 5PM

By

Published : Jul 11, 2021, 5:00 PM IST

రేపు తెరాసలోకి ఎల్​.రమణ

రేపు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఎల్​.రమణ తెరాసలో చేరనున్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అది చాలా చిన్న పదవి

తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని.. పార్టీ మారే ఆలోచన లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. తన దృష్టిలో పీసీసీ అధ్యక్ష పదవి చాలా చిన్నదని చెప్పారు. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'వారి లేఖలు తిరస్కరించలేదు'

తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను తిరస్కరించలేదని తితిదే(TTD) ఓ ప్రకటన విడుదల చేసింది. లేఖలను తిరస్కరిస్తున్నారని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనం సమయం తక్కువగా ఉండటం, ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల నుంచి కోటాకు మించి వచ్చిన లేఖలను తిరస్కరించామని వివరించింది.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

భార్య వేధింపులే కారణమా..?​

హైదరాబాద్​ సనత్​నగర్​ ఠాణా పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి బలవన్మరణానికి భార్య వేధింపులే కారణమని... కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' ముగ్గురూ ఒక్కటే'

ఏపీ ప్రభుత్వం అమలు చేయనున్న నూతన ఆస్తి పన్ను విధానంతో.. గుడిసెల్లో ఉన్న వాళ్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. జగన్, కేసీఆర్ మధ్య సాన్నిహిత్యం ఉందని.. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వారి వ్యాపారాల కోసం నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అంతకంటే ప్రమాదకరమా?

కరోనా కారణంగా విలవిలలాడుతున్న ప్రజలను జికా వైరస్​ భయపెడుతోంది. కేరళలో ఇప్పటికే బయటపడ్డ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఈ జికా వైరస్​ ఏంటి? కరోనాతో పోల్చుకుంటే ఇది ఎంత ప్రమాదకరం? దీనికి మందులున్నాయా? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అందుకు బలమైన సంకేతాలు

జనాల్లో మార్పు రాలేదు. రెండో దశలో(Covid second wave) చూసిన అత్యంత భయానక దృశ్యాలు మర్చిపోయారు. ఒక్కసారి కేసులు తగ్గగానే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్​నాట్ విలువను గమనిస్తే.. థర్డ్​వేవ్(Third wave) సంకేతాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వాటిలో ఏది బెటర్​?

రోజురోజుకూ డిజిటల్ పేమెంట్లకు ఆదరణ​ పెరుగుతోంది. సులభంగా మొబైల్ ​ఫోన్ నుంచి​ కూడా పేమెంట్​లు చేసుకునేందుకు వీలుండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే డిజిటల్ పేమెంట్లు పూర్తయ్యేందుకు ప్రస్తుతం యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్​టీజీఎస్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వీటి మధ్య తేడా ఏమిటి?

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అతనే బెస్ట్ '

అన్ని ఫార్మాట్లలో టీమ్​ ఇండియా ఓపెనర్​గా ఉన్న.. రోహిత్​ శర్మపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. రానున్న ఇంగ్లాండ్​ సిరీస్​లో రాణిస్తాడని ఇప్పటికే పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. అయితే.. ప్రపంచంలోనే రోహిత్​ అత్యుత్తమ ఆటగాడు అని కొనియాడాడు టీమ్​ ఇండియా మాజీ ప్లేయర్ రీతిందర్​ సింగ్​​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అతని​ ఫిజిక్​ అదుర్స్

అక్కినేని అఖిల్​-దర్శకుడు సురేందర్​రెడ్డి కాంబినేషన్​లో రూపొందుతున్న చిత్రం 'ఏజెంట్​'(Akhil Agent). ఈ సినిమా కోసం అఖిల్‌.. కండలు తిరిగిన దేహంతో సరికొత్తగా మారారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details