తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @5PM
టాప్​టెన్​ న్యూస్​ @5pm

By

Published : May 4, 2021, 5:00 PM IST

  • రాష్ట్రాలకు మరో 48 లక్షల టీకాలు!

రానున్న మూడు రోజుల్లో 48 లక్షల డోసులను రాష్ట్రాలకు అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రాల్లో 75 లక్షలకుపైగా డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • జేఈఈ మెయిన్స్​ మే సెషన్​ వాయిదా

కరోనా రెండో దశ వ్యాప్తి కారణంగా జేఈఈ- మెయిన్స్ మే సెషన్​ వాయిదా పడింది. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బలవంతపు చర్యలొద్దు..

ఈటల కుటుంబానికి చెందిన జమున హేచరీస్​ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈటల కుటుంబం దాఖలు చేసిన అత్యవసర పిటిషన్​పై.. న్యాయమూర్తి జస్టిస్ వినోద్​కుమార్ విచారణ చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నేను సీఎం కావాలనుకోలేదు..

మాజీ మంత్రి ఈటల రాజేందర్​ అత్యవసర పిటిషన్​పై హైకోర్టు జరిపిన విచారణపై ఆయన స్పందించారు. త్వరలోనే పూర్తి విచారణ జరిగి... ప్రభుత్వ బాధ్యతారాహిత్యం బయటపడుతుందని స్పష్టం చేశారు. ఒక బాధ్యత కలిగిన మంత్రిపై కక్ష్యపూరింతంగా వ్యవహరించి అవమానించటం దేశంలో ఇదే మొదటిసారి అని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పేదల ఆకలి తీరుస్తున్న సీతక్క..

ఆకలితో కడుపు ఖాళీగా ఉండకూడదన్నదే ఆమె లక్ష్యం. అందుకోసం ఎంతదూరమైన కాలినడకతోనే వెళ్తుంది. కొండ ప్రాంతంలో నివసించే గిరిజనులకు అన్నీ తానై ఆదరిస్తుంది. మొదటి దశ కరోనా వైరస్‌ వచ్చినప్పుడు వేలమందికి నిత్యావసర సరుకులు అందించింది. మరోసారి మహమ్మారి విజృంభణతో బాధితులకు ఆదుకునేందుకు ముందుకు వచ్చింది కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అన్యాయంగా కొట్టారు..

భార్యాభర్తల మధ్య గొడవలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జోక్యం చేసుకోవడమే కాకుండా భర్తను పీఎస్‌కు తీసుకెళ్లి చితకబాదారు. ఈ సంఘటన సికింద్రాబాద్‌లోని మోండామార్కెట్‌ పరిధిలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • టీకాపై సందేహాలా?

అందరూ కోరుకున్నట్టుగానే, అనతికాలంలోనే 18 ఏళ్లు పైబడ్డవారికీ కొవిడ్‌-19 టీకా అందుబాటులోకి వచ్చింది. కరోనా మీద వీలైనంత త్వరగా, సమర్థంగా విజయం సాధించటంలో ఇది అత్యంత కీలక పరిణామం అనటం నిస్సందేహం. మన దేశంలో యువతీ యువకుల సంఖ్య ఎక్కువ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పంచాయతీ ఎన్నికల్లో మిస్​ ఇండియా..

యూపీ పంచాయతీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న మిస్​ ఇండియా రన్నరప్​ దీక్షా సింగ్​ ఓటమి పాలయ్యారు. కేవలం 2వేల ఓట్లు దక్కించుకుని ఐదో స్థానంలో నిలిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రతి ఒక్కరి సంక్షేమం ముఖ్యమే..

ఐపీఎల్​ నిరవధిక వాయిదాపై బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించారు. టోర్నీతో సంబంధమున్న ప్రతి ఒక్కరి సంక్షేమం తమకు ముఖ్యమని తెలిపారు. ఈ విషయంలో రాజీపడబోమని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'రాధే' సినిమా సెన్సార్ పూర్తి..

బాలీవుడ్​ స్టార్​ సల్మాన్​ ఖాన్​ నటించిన 'రాధే' సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్​ను జారీ చేసింది సెన్సార్​ బోర్డు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details